నాని ( Nani ) మరో లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.నాని నటించిన ”హాయ్ నాన్న”( Hi Nana ) సినిమా మొన్న డిసెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
నాని అండ్ టీమ్ ముందు నుండి డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తూ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెరిగేలా చేశారు.ఆ ప్రమోషన్స్ కారణంగా ముందుగానే ఈ సినిమాకు పాజిటివ్ వైబ్స్ అయితే వచ్చాయి.
ఇక ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాత ఫస్ట్ షో నుండే ఈ సినిమాకు పాజిటివ్ బజ్ వచ్చింది.మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో నాని మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు.

రిలీజ్ అయ్యిన ప్రతీ చోట మంచి స్పందన రావడంతో థియేటర్స్ లో నాని హవా కనిపిస్తుంది.వీకెండ్ తర్వాత కూడా నాని ర్యాంపేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.ఇక్కడ మాత్రమే కాదు యూఎస్ మార్కెట్ లో కూడా నాని మరోసారి తన స్టామినా చూపిస్తున్నాడు.తాజాగా మరో మైల్ స్టోన్ మార్క్ ను దాటేశాడు.

యుఎస్ లో నాని ఇప్పటి వరకు 1.5 మిలియన్ డాలర్స్ గ్రాస్ ను అందుకున్నట్టు కన్ఫర్మ్ అయ్యింది.దీంతో హాయ్ నాన్న సినిమాతో నాని మరో మిలియన్ మార్క్ సినిమాను తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ వీకెండ్ కూడా నాని దూసుకు కంటిన్యూ అయ్యేట్టుగానే కనిపిస్తుంది.
కాగా ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కించగా ఇందులో బేబీ కియారా ఖన్నా( Baby Kiara Khanna ) నాని కూతురు రోల్ పోషించింది.అలాగే నానికి జోడీగా మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) హీరోయిన్ గా నటించగా వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.
హేషమ్ అబ్దుల్ సంగీతం అందించారు.







