'హాయ్ నాన్న'లో శృతి రోల్ ఎమోషనల్ గా ఉండబోతుందా.. కన్నీళ్లు పెట్టిస్తుందట!

దసరా( Dasara ) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత అదే ఊపులో నాని ( Natural Star Nani ) మరో సినిమాను స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఎప్పుడు నాని సినిమాలు మనసుల్ని హత్తుకునేలా ఉంటాయి.

మరి ఈసారి కూడా అలానే ఉండే కథను ఏరికోరి ఎంచుకుని మరీ ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.నాని ప్రస్తుతం కొత్త డైరెక్టర్ శౌర్యన్ తో హాయ్ నాన్న( Hi Nanna ) సినిమా చేస్తున్నాడు.

తాజాగా ట్రైలర్ రిలీజ్ చేయగా అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.ఈ సినిమాలో నాని, మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) జంటగా నటిస్తున్నారు.

నాని తండ్రిగా, లవర్ గా అలరించనున్నాడు.

Advertisement

ఈ సినిమా డిసెంబర్ 7న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.దీంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచేసి ఆడియెన్స్ కు ఈ సినిమాను మరింత దగ్గర చేసేస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమాలో ప్లాష్ బ్యాక్ పై క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది.

ఇందులో శృతి హాసన్ కూడా కీలక రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.

మరి నాని, శృతి మధ్య లవ్ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని అలాగే వీరి ప్రేమ కథ విషాదంగా ముగుస్తుందని మెయిన్ గా శృతి ( Shruti Haasan ) రోల్ అయితే చాలా ఎమోషనల్ గా ఆడియెన్స్ చేత కన్నీళ్లు పెట్టించేలా ఉంటుందని టాక్.మొత్తానికి ఈసారి కూడా నాని ఏడిపించడానికి రెడీ అయ్యాడు.ఇక ఈ సినిమాలో బేబీ కియారా ఖన్నా( Kiara Khanna ) కీ రోల్ పోషిస్తున్నారు.

నాని కూతురు పాత్రలో ఈ భామ నటిస్తుంది.వైరా ఎంటెర్టైనమెంట్స్ బ్యానర్ పై మోహన్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?

హేషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు