తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నాని ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
ఈ ఏడాది ఆరంభంలో దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న నాని ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నారు.హాయ్ నాన్న( Hi nanna ) అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు నాని.
ఈ సినిమా డిసెంబర్ 7వ తేదీ విడుదల కానున్న విషయం మనందరికీ తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఆ పాటలు పోస్టర్లు టీజర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని నాని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో నాని ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నాడు.ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో యాంకర్ ప్రశ్నిస్తూ దసరా లాంటి మాస్ సినిమా తర్వాత శౌర్యువ్( Shouryuv) ) దర్శకత్వంలో హాయ్ నాన్న లాంటి క్లాస్ సినిమా ఎందుకు సెలక్ట్ చేసుకున్నారని నానిని అడగగా.
నాని స్పందిస్తూ నేను ఇలాంటి సినిమాలే చేస్తానని ఫ్యాన్స్ ఎప్పుడూ ఫిక్స్ అవలేదని నాని అన్నాడు.అనంతరం చిరంజీవి గురించి మాట్లాడుతూ.

ఖైదీ సినిమా( Khaidi ) తర్వాత చిరంజీవి గారు అన్నీ మాస్ సినిమాలే చేశారా లేదు కదా, ఒక వేళ అలా చేసి ఉంటే ఆయన ప్రయాణం ఇంత గొప్పగా ఉండేది కాదు.చిరంజీవి గారు మాస్‌లో పెద్ద స్టార్ అయినప్పటికీ ఆయన అన్ని వర్గాల ప్రేక్షకులను తన విభిన్నమైన సినిమాలతో మెప్పించారు అని చెప్పుకొచ్చాడు నాని.అలాగే నేను పెద్ద స్టార్ ని కావాలని ఎప్పుడూ అనుకోలేదు.నా కెరీర్‌లో గుర్తుండిపోయే సినిమాలు చేయాలి అంతే.ప్రేక్షకులు నా సినిమాల గురించి చాలా కాలం మాట్లాడుకోవాలి.నాకు అది చాలు.
చిరంజీవి గారితో నన్ను నేను పోల్చుకొని ఈ మాట చెప్పడం లేదు.కేవలం ఒక ఉదాహరణ చెప్పానంతే అని తెలిపాడు నాని.







