నాని హైదరాబాద్‌ ఫ్యాన్స్ అసంతృప్తి... దసరా పండుగ మాకు లేదా భయ్యా?

Nani Fans Angry About Dasara Film Pre Release Event , Dasara, Dasara Movie, Flim News, Keerthy Suresh , Nani

నేచురల్ స్టార్ నాని ( Nani )హీరో గా రూపొందిన దసరా ( Dussehra )సినిమా మార్చి 30 తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.కీర్తి సురేష్( Keerthy Suresh ) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురం లో జరిగింది.

 Nani Fans Angry About Dasara Film Pre Release Event , Dasara, Dasara Movie, Flim-TeluguStop.com

నిన్న రాత్రి భారీ ఎత్తున జరిగిన ఈవెంట్ లో నాని తో పాటు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.హైదరాబాదు లో ఈ చిత్రం యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించక పోవడం పట్ల అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నాని ఫాన్స్ తో పాటు ఇతర యూనిట్ సభ్యులు కూడా హైదరాబాదు లో ఈవెంట్ నిర్వహిస్తే బాగుండేదని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.కానీ ఇప్పటి వరకు హైదరాబాదు లో ఎలాంటి ఈవెంట్ ఉండబోదని క్లారిటీ వచ్చేసింది.

అయితే నాని మాత్రం తన స్నేహితుల వద్ద కచ్చితం గా సినిమా సూపర్ హిట్ అయితే హైదరాబాద్( Hyderabad ) లో భారీ సక్సెస్ మీట్ ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చినట్లుగా చెప్పుకొచ్చాడట.

హైదరాబాద్‌ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేయడం ద్వారా ఫ్యాన్స్ ని సంతృప్తి చెందించాలని నాని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తుంది.అన్ని అనుకున్నట్లుగా జరిగితే దసరా సినిమా హైదరాబాద్ లోని ప్రముఖ కన్వెన్షన్ లో భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కాకుండా సక్సెస్ మీట్ ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) ఈ సినిమా తో దర్శకుడి గా పరిచయం కాబోతున్నాడు.

ఈ సినిమా సింగరేణి బొగ్గు గనుల నేపథ్యం లో రూపొందిన విషయం తెల్సిందే.కీర్తి సురేష్ మరియు నాని ఇద్దరు కూడా డీ గ్లామర్ గానే ఈ సినిమాలో కనిపించారు.

మరీ ఇంత డీ గ్లామర్‌ ను చూడటం సాధ్యమా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Video : Nani Fans Angry About Dasara Film Pre Release Event #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube