న్యాచురల్ స్టార్ నాని( Nani ) హీరోగా కీర్తి సురేష్( Keerthy Suresh ) హీరోయిన్ గా శ్రీకాంత్ ఓదెల ( Srikanth Odela )దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ ”దసరా”.( Dasara ) రా అండ్ విలేజ్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాపై ముందు నుండి మంచి అంచనాలు ఉన్నాయి.
సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్ ఈ సినిమాను అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు.
ధరణి పాత్రలో నాని నటిస్తుండగా.
నాని, కీర్తి ఇద్దరు కూడా డీ గ్లామర్ పాత్రలలో కనిపించనున్నారు.నాని ఊర మాస్ ఇంటెన్స్ లుక్ కు సంబంధించిన పలు పోస్టర్ లను రిలీజ్ చేయగా ఇవన్నీ ఫ్యాన్స్ లో మంచి వైరల్ గా నిలిచాయి.
మొదటిసారి నాని పాన్ ఇండియా సినిమాలో నటిస్తుండడం విశేషం.దీంతో నాని ముందు కంటే కూడా ఈ సినిమాను జనాలకు చేరువ చేయడంలో ఎక్కువ కష్ట పడుతున్నాడు.
ఇక ఈ సినిమా మార్చి 30న భారీ స్థాయిలో పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.ఈ క్రమంలోనే అన్ని పనులు పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధం అయ్యింది.మరి తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అతి త్వరలోనే దసరా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఈ భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పై ఇంట్రెస్టింగ్ బజ్ ఇప్పుడు నెట్టింట వినిపిస్తుంది.అందుతున్న వార్తల ప్రకారం.ఈ సినిమాకు నలుగురు ఊహించని గెస్టులు రాబోతున్నారని.
అంటున్నారు.లేదంటే జస్ట్ సోలో ప్రీ రిలీజ్ లా జరిగే అవకాశం కూడా ఉందని రెండు రకాల టాక్ రావడంతో ఈ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.
మార్చి 25 లేదా 26న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే ఛాన్స్ ఉందట.