దసరా మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలివే.. ఆ ఏరియాల టార్గెట్ ఎంతంటే?

మరికొన్ని గంటల్లో నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన దసరా మూవీ( Dasara movie ) థియేటర్లలో విడుదల కానుందనే సంగతి తెలిసిందే.ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా పలు ప్రాంతాల్లో ఈ సినిమాకు టికెట్లు దొరకడం కూడా కష్టమవుతోంది.

 Nani Dasara Movie Pre Release Business Details, Nani , Dasara Movie, Dasara Pre-TeluguStop.com

అయితే ఈ సినిమాకు 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడం గమనార్హం.నాని ( Nani ) గత సినిమాలను మించి ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్( Pre release business ) జరిగింది.

దసరా నైజాం హక్కులు 13.7 కోట్ల రూపాయలకు అమ్ముడవగా సీడెడ్ లో 6.5 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.ఈ సినిమా ఉత్తరాంధ్ర హక్కులు 3.9 కోట్ల రూపాయలకు అమ్ముడవగా గోదావరి జిల్లాల్లో 4.35 కోట్ల రూపాయలకు ఈ సినిమాల హక్కులు అమ్ముడయ్యాయి.కృష్ణా, గుంటూరు జిల్లాల హక్కులు 5 కోట్ల రూపాయలకు అమ్ముడవగా నెల్లూరు హక్కులు కోటీ 20 లక్షల రూపాయలకు అమ్ముడయ్యాయి.

ఈ సినిమా ఏపీ, తెలంగాణ హక్కులు 34.65 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.ఓవర్సీస్ హక్కులు 6 కోట్ల రూపాయలకు అమ్ముడవగా నార్త్ ఇండియా హక్కులు 5 కోట్ల రూపాయలకు అమ్ముడయ్యాయి.ఇతర భాషల హక్కులు కోటిన్నర రూపాయలకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.50 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం అందుతోంది.

నాని, కీర్తి సురేష్ జంటగా నటించిన ఈ సినిమా ఫలితం మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.దసరా సినిమా నాని కెరీర్ బెస్ట్ మూవీగా నిలవాలని ఫ్యాన్స్ కోరుకుంటుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.నాని రేంజ్ మరింత పెరగాలని నాని మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.నాని కొత్త సినిమాలకు సంబంధించి త్వరలో ప్రకటన రానుందని సమాచారం అందుతోంది.సినిమా సినిమాకు నాని క్రేజ్, పారితోషికం అంతకంతకూ పెరుగుతోంది.ఇతర హీరోలకు భిన్నంగా నాని అడుగులు వేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube