ప్రాక్టీస్ కోసం వచ్చిన ధోని.. చెన్నై చెపాక్ స్టేడియంలో అభిమానుల హోరు

ఐపీఎల్‌లో ఉన్న 10 జట్లలో చెన్నై సూపర్ కింగ్స్‌( Chennai Super Kings )తో అభిమానులకు ఉద్వేగభరితమైన సంబంధం ఉంది.దీనికి ముఖ్యమైన కారణం కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని.41 ఏళ్ల క్రికెటర్ ఆ జట్టుకు నాలుగు టైటిల్స్ అందించాడు.సీఎస్కేను ఏకంగా రికార్డు స్థాయిలో తొమ్మిది సార్లు ఫైనల్స్‌కు తీసుకువెళ్ళాడు.

 Dhoni Who Came For Practice.. A Chorus Of Fans At Chepak Stadium, Chennai , Ipl-TeluguStop.com

ఈ గణాంకాలే అతడిని చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు ఆరాధ్య దైవంగా మార్చేశాయి.ఇక మరో రెండు రోజుల్లో ఐపీఎల్ ప్రారంభం కానుంది.

మరోవైపు ఈ సీజన్ ధోనికి చివరిది కావొచ్చు.ఈ తరుణంలో చెన్నై చెపాక్‌లోని చిదంబరం స్టేడియానికి ధోని( MS Dhoni ) ప్రాక్టీస్ నిమిత్తం ఇటీవల వచ్చాడు.

స్టేడియంలో అడుగు పెట్టగానే భారీగా తరలి వచ్చిన అభిమానులు స్టేడియాన్ని హోరెత్తించారు.ధోని.

ధోని.అంటూ అరుస్తూ అతడు ప్రాక్టీస్‌లో కొట్టిన సిక్స్‌లకు చప్పట్లతో ప్రోత్సాహం ఇచ్చారు.

చెన్నై సూపర్ కింగ్స్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్‌లో సోమవారం సాయంత్రం ఒక వీడియో అప్‌లోడ్ చేసింది.అందులో ధోని చేతిలో బ్యాట్ తో క్రీజ్ వైపు వెళుతున్నాడు.మహిని చూసినప్పుడు, స్టేడియం అతని పేరుతో ప్రతిధ్వనించింది.ఐపీఎల్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది.తొలి మ్యాచ్‌ చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ జట్ల మధ్య జరగనుంది.ఇక చెన్నై జట్టు సొంత స్టేడియంలో ఏడు మ్యాచ్‌లు ఆడనుంది.

గత సీజన్‌లో ప్లేఆఫ్స్‌కు చేరడంలో సీఎస్కే జట్టు విఫలమైంది.ఆ సమయంలో కెప్టెన్ గా జడేజా( Ravindra Jadeja ) వ్యవహరించాడు.అతడు విఫలం కావడంతో తిరిగి జట్టు పగ్గాలు ధోని చివర్లో చేపట్టాడు.ఇప్పటికే ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.కేవలం ఐపీఎల్ లో మాత్రమే కొనసాగుతున్నాడు.త్వరలో భారత్ జట్టుకు కోచ్ లేదా మెంటార్‌గా బాధ్యతలు తీసుకుంటాడని వార్తలొస్తున్నాయి.

అదే జరిగితే చెన్నై జట్టుకు ధోని ఇక ఆడకపోవచ్చు.అందువల్లే ఇదే ధోనికి ఆఖరి సీజన్ అని ప్రచారం సాగుతోంది.

దీంతో ఈ ఐపీఎల్ లో చెన్నై టైటిల్ సాధించాలని ఆ జట్టు అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube