జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.చెప్పులు పోతే మూడు రోజుల తరువాత కంగారు పడుతున్నారని విమర్శించారు.
గత ఏడాది అక్టోబర్ 18న తాను గుడికి వెళ్లగా ఒక చెప్పు పోయిందన్నారు.ఒక చెప్పు పోయి తొమ్మిది నెలలు అయ్యిందన్న పేర్ని నాని ఎవరిని అనుమానిస్తామని ప్రశ్నించారు.
ఎదురుగా పవన్ కార్యాలయం ఉంటే ఆయనను అనుమానిస్తామా అని అడిగారు.చెప్పులు పోతే ఎవరో ఒకరు కొంటారని తెలిపారు.
అంతకంటే ముందు పార్టీ సింబల్ గాజు గ్లాస్ పోయింది అది చూసుకో అని సూచించారు.