తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది హీరోలు కమర్షియల్ యాడ్స్ లో నటించిన విషయం తెలిసిందే.రామ్ చరణ్, అల్లు అర్జున్, మహేష్ బాబు, ఎన్టీఆర్ ఇలా చాలామంది హీరోలు ఒక్కొక్కరు ఒక్కొక్క బ్రాండ్ ని ప్రమోట్ చేస్తున్నారు.
కేవలం హీరోలు మాత్రమే కాకుండా హీరోయిన్లు కూడా పలు కమర్షియల్ యాడ్స్ లో నటించిన విషయం తెలిసిందే.నాని( Nani ) కూడా గతంలో పలు యాడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన విషయం తెలిసిందే.
ఇప్పుడు మరొక యాడ్ లో నటిస్తున్నారు నాని.

ఈ క్రమంలోనే నాని ప్రస్తుతం పూణేలో( Pune ) వున్నారు.అక్కడ ఏమి చేస్తున్నాడు అని అనుకుంటున్నారా? అక్కడ ఒక యాడ్ షూట్ కోసం వెళ్ళాడట.అది కూడా ఒక సాఫ్ట్ డ్రింక్ యాడ్ కోసం అని సమాచారం.
ఈ యాడ్ లో బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్( actress Shraddha Kapoor ) కూడా ఉందట.ఈ ఇద్దరు ఈ సాఫ్ట్ డ్రింక్ కోసం అక్కడ షూటింగ్ చేస్తున్నారు అని తెలిసింది.
కాగా నాని ఇటీవలే దసరా సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే.శ్రీకాంత్ ఓదెల( Srikanth Odela ) ఈ సినిమాకు దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
అయితే నాని నేడు శ్రీకాంత్ ఓదెల వివాహానికి వెళ్ళవలసి ఉంది.

కానీ ఈ యాడ్ షూట్( Shoot ad ) ఉండటం అందులోను ముందుగానే శ్రద్ధా కపూర్ తేదీలు కూడా ఫిక్స్ అవటంతో వెళ్లలేకపోతున్నాడు అని తెలిసింది.కానీ దర్శకుడికి మెసేజ్ పెట్టాడని తెలిసింది.మరి నాని ఎటువంటి యాడ్ లో నటిస్తున్నాడు? ఆ యాడ్ ఏంటి అన్న వివరాలు తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే మరి.ఇకపోతే ఇటీవలె దసరా సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్న నాని ప్రస్తుతం ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.నాని తదుపరి సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్లు లేవు.







