యంగ్ హీరోలు నాని( Nani ) మరియు నితిన్( nithin ) లు ఒకే రోజు తేడాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అయ్యారు.నాని హాయ్ నాన్న సినిమా( hi nanna movie ) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.
ఈ సినిమా లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించబోతుంది అనే సమాచారం అందుతోంది.ఈ సినిమా లో నాని చాలా సెంటిమెంట్ సన్నివేశాలు చేశాడట.
అందుకే ఈ సినిమా లో నాని ఏడ్వడంతో పాటు ఏడిపించబోతున్నాడు అంటూ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.నాని ఏడ్చిన సినిమా లు, ఏడిపించిన సినిమా లు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి.

అందుకే నాని కి హాయ్ నాన్న సినిమా మంచి విజయాన్ని తెచ్చి పెట్టడం ఖాయం అన్నట్లుగా పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది.ఇక నితిన్ హీరోగా ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమా( extraordinary movie ) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.వక్కంతం వంశీ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందింది.శ్రీ లీల ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.ఈ సినిమా కి పాజిటివ్ బజ్ కంటే నెగటివిటీ ఎక్కువగా ఉంది.దర్శకుడు వక్కంతం వంశీ గత చిత్రం ఫ్లాప్, ఇక నితిన్ గత చిత్రాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది అంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

నాని హాయ్ నాన్న సినిమా కు ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరి పోయింది.విడుదలకు ముందే నిర్మాతకు లాభాలు వచ్చాయి.ఇక నితిన్ ఆర్డినరీ మెన్ సినిమా కు పరిస్థితి ఏంటి అనేది క్లారిటీ రావాల్సి ఉంది.నాని సినిమా కు ఉన్న పాజిటివ్ బజ్ కారణంగా మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి.
అయితే నితిన్ గత చిత్రాల అనుభవం నేపథ్యం లో ఓపెనింగ్స్ కాస్త తక్కువ ఉండే అవకాశం ఉంది.అయితే సినిమా లు విడుదల తర్వాత ప్రేక్షకుల టాక్ ని బట్టి లాంగ్ రన్ వసూళ్లు ఉంటాయి.
కనుక ఈ రెండు సినిమా ల్లో ప్రేక్షకుల నుంచి ఏ సినిమా కు పాజిటివ్ టాక్ వస్తుంది.ఏ సినిమా పాజిటివ్ రివ్యూలు దక్కించుకుంటుందో చూడాలి.