టీజర్‌ టాక్ : అంటే సుందరానికి.. అసలు మ్యాటర్ ఏంటీ?

నాని హీరో గా నజ్రియా హీరోయిన్గా వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో మైత్రి మూవీస్ వారు నిర్మించిన చిత్రం అంటే సుందరానికి.

ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది.

భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా కు సంబంధించిన టీజర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది.టీజర్ విడుదల కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించిన చిత్ర యూనిట్ సభ్యులు అందరినీ ఆశ్చర్య పరిచారు.

ఇక టీజర్‌ ఎలా ఉంది అనే విషయానికి వస్తే.వినోదాత్మకంగా సినిమా ఉంటుందని టీజర్ చెప్పకనే చెబుతోంది.

నాని ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి.ఇక హీరోయిన్ క్రిస్టియన్ కుటుంబానికి చెందిన వ్యక్తి.

Advertisement

రెండు కుటుంబాలు కూడా వారి వారి మతాలను చాలా బలంగా నమ్మే వారు.అలాంటి కుటుంబాలకు చెందిన వీరిద్దరి మద్య ప్రేమ ఎలా మొదలైంది.

అసలు ఇద్దరి మధ్య ప్రేమ ఎలా కొనసాగింది అనేది కథగా తెలుస్తుంది.వీరిద్దరి మధ్య ప్రేమ మరియు రెండు కుటుంబాల మధ్య సన్నివేశాలు చాలా వినోదాత్మకంగా చూపించబోతున్నట్లుగా టీజర్ని చూస్తే అర్థమవుతుంది.

దర్శకుడు వివేక్ ఆత్రేయ మంచి ప్రతిభ ఉన్న దర్శకుడు అనడంలో సందేహం లేదు.ఆయన గత చిత్రాల్లో కూడా మంచి వినోదాన్ని అందించాడు.

కనుక ఈ సినిమా తప్పకుండా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే విధంగా వినోదాత్మకంగా ఉంటుందనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరూ వ్యక్తం చేస్తున్నారు.నాని ఎప్పటిలాగే ఈ సినిమా లోని సుందరం పాత్ర లో మంచి ఎంటర్టైన్మెంట్ అందించడం ఖాయం గా కనిపిస్తుంది.

ఆ యాంకర్లు బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో పాపులర్.. వింధ్య షాకింగ్ కామెంట్స్ వైరల్!
వదిన సురేఖ వద్ద రెండు కోట్లు అప్పు తీసుకున్న పవన్ కళ్యాణ్.. ఆస్తుల చిట్టా ఇదే?

ఇక మొదటి సారి తెలుగు లో మలయాళం నటి నజ్రియా ఎంట్రీ ఇస్తుంది.తప్పకుండా టాలీవుడ్ లో ఈమె స్టార్ హీరోయిన్ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

నాని మరియు నజ్రియా కాంబో ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమాని జూన్‌ 10వ తారీకున ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

సినిమా ను కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మరియు మలయాళంలో కూడా విడుదల చేయబోతున్నారు.

తాజా వార్తలు