'దసరా' పాన్ ఇండియా ప్రీ రిలీజ్ పరిస్థితి ఏంటి? అడ్వాన్స్ బుకింగ్‌ ఎలా జరుగుతోంది?

నాని హీరోగా నటించిన దసరా చిత్రం మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కి శ్రీకాంత్ ఓదెల( Srikanth Odhela ) దర్శకత్వం వహించాడు.

 Nani And Keerthy Suresh Dasara Movie Pre Release Business , Nani , Keerthy Sur-TeluguStop.com

భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా కి అన్ని ఏరియాల్లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ పూర్తయిందట.చిత్ర యూనిట్ సభ్యులు ఆశించినట్లుగానే తెలుగు రాష్ట్రాల్లో కాస్త ఎక్కువగానే ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందట.

కానీ ఉత్తర భారతంలో మరియు కేరళలో మాత్రం దసరా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఆశించిన స్థాయిలో జరగలేదని ప్రచారం జరుగుతోంది.ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగినా.

జరగక పోయినా సినిమా విడుదల తర్వాత దేశ వ్యాప్తంగా దసరా పేరు మారు మ్రోగడం ఖాయం.తద్వారా భారీగా కలెక్షన్స్ రావడం ఖాయం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకం తో ఉన్నారు.

అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా దసరా సినిమా ఉంటుందని ఇటీవల నాని పలు ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.

Telugu Dasara, Keerthy Suresh, Nani, Pre, Srikanth Odhela, Tollywood-Movie

అంతే కాకుండా ఈ సినిమా కు భాష తో సంబంధం లేదని అన్ని భాషల వారు కూడా ఈ సినిమా ను ఎంజాయ్ చేస్తారని కూడా చిత్ర యూనిట్ సభ్యులు చెప్తున్నారు.సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడ్డారని ఆ కష్టానికి ప్రతిఫలం ఖచ్చితంగా ఉంటుందని నాని తెలియజేశాడు.తెలుగు లో మంచి మార్కెట్ ఉన్న కారణంగా నాని సినిమా భారీగా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేయగలిగింది.ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.100 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందని మొన్నటి వరకు అంతా భావించారు.కానీ ఆ స్థాయిలో జరగలేదు అనేది సమాచారం.

Telugu Dasara, Keerthy Suresh, Nani, Pre, Srikanth Odhela, Tollywood-Movie

సినిమా ఖచ్చితంగా రూ.150 నుండి 175 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేయడం ఖాయం అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంతో ఉన్నారు.నాని మరియు కీర్తి సురేష్( Nani ) ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా దేశం మొత్తం చుట్టేసి అందరి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నించారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కు భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్ జరిగింది.ఉత్తర భారతంలో సినిమా విడుదలై పాజిటివ్ టాక్ వచ్చిన తర్వాత మంచి కలెక్షన్స్ నమోదయ్యే అవకాశం ఉందని చిత్ర యూనిట్ సభ్యులు ధీమా తో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube