నాని30 : గడ్డం ఉండదు అంటూ వినూత్న వీడియో

నాని ప్రస్తుతం దసరా సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.ఆ సినిమా షూటింగ్ కార్యక్రమాలు త్వరలో పూర్తి కాబోతున్నాయి.

ఇటీవలే చివరి షెడ్యూల్ ప్రారంభం అయినట్లుగా సమాచారం అందుతుంది.ఈ సమయం లోనే నాని 30వ సినిమా అధికారిక ప్రకటన వచ్చింది.

కొత్త బ్యానర్ లో నాని సినిమా రూపొందిపోతుంది.సీతారామం సినిమా తో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు విపరీతంగా నచ్చిన బాలీవుడ్ ముద్దుగుమ్మ మృనాల్ ఠాకూర్ ఈ సినిమా లో నాని కి జోడి గా హీరోయిన్ గా నటించబోతోంది.

ఇక ఈ సినిమా కు సంబంధించిన ప్రకటన వీడియో విభిన్నంగా రూపొందించడం తో అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటుంది.

Advertisement

నాని ఈ సినిమాలో ఏడు ఎనిమిది సంవత్సరాల పాప కి తండ్రిగా కనిపించబోతున్నట్లు ఈ వీడియో ని బట్టి అర్థమవుతుంది.అంతే కాకుండా వీడియోలో పాప ఇంకా ఎన్ని రోజులు గడ్డంతో కనిపిస్తావు ఈ గడ్డం నాకు నచ్చలేదు అన్నట్లుగా వ్యాఖ్యలు చేయడం తో దసరా సినిమా తర్వాత తీసేస్తాను.మన సినిమా లో గడ్డం ఉండదు, మీసాలు ఉండవు.

జుట్టు ఉంటుంది అంటూ సరదాగా చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.కూతురుతో నీకు నచ్చిన వారు మాత్రమే ఇందులో ఉంటారు అన్నట్లుగా ఇతర నటీ నటులు మరియు టెక్నికల్ టీం ను నాని పరిచయం చేశాడు.

భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు అతి త్వరలోనే ప్రారంభం అవుతాయని తెలుస్తోంది.ఈ సినిమా కు శౌర్యువ్ దర్శకత్వం వహించబోతున్నాడు.2023 సంవత్సరం లోనే నాని 30వ సినిమా కూడా విడుదల అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.ఈ ఏడాది లో నాని నుండి రెండు సినిమాలు రాబోతున్నాయి అన్నమాట.

దసరా సమ్మర్ కానకగా విడుదల కాబోతుండగా ఈ సినిమా కాస్త ఆలస్యంగా విడుదల అయ్యే అవకాశం ఉంది.

ఖ‌ర్జూరాలు తినే ముందు ఇవి తెలుసుకోపోతే..మీ దంతాల‌కే ముప్పు జాగ్ర‌త్త‌!
Advertisement

తాజా వార్తలు