ఎన్టీఆర్ పేరు మార్పును రాజకీయం కోసం వాడడం తప్పు.. నారా నందమూరి హీరోస్ వైరల్ పోస్ట్!

ప్రస్తుతం ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి.ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ని కాస్త వైయస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై రాజకీయ పరంగా తీవ్ర దుమారం రేపుతోంది.

 Nandamuri Kalyan Ram And Nara Rohith Reacts On Ntr Health University Name Change Details, Ysr Health University, Ntr Health University Name Change, Ntr Health University Controversy, Kalyan Ram, Nara Rohith, Ap Government, Tdp, Junior Ntr, Nandamuri Taraka Rama Rao-TeluguStop.com

దీంతో ఏపీలో ఉన్న టీడీపీ నేతలు అలాగే ఎన్టీఆర్ అభిమానులు వైసీపీ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు.ఈ నేపథ్యంలోనే వరుసగా నందమూరి హీరోలు కూడా ఈ విషయంపై స్పందిస్తున్నారు.

నందమూరి హీరోలు సైతం ప్రభుత్వ నిర్ణయం సరికాదు అని తెలుపుతున్నారు.కాగా ప్రభుత్వం నిర్ణయం పై తాజాగా నందమూరి హీరో కళ్యాణ్ రామ్ స్పందించారు.

 Nandamuri Kalyan Ram And Nara Rohith Reacts On Ntr Health University Name Change Details, Ysr Health University, Ntr Health University Name Change, Ntr Health University Controversy, Kalyan Ram, Nara Rohith, Ap Government, Tdp, Junior Ntr, Nandamuri Taraka Rama Rao-ఎన్టీఆర్ పేరు మార్పును రాజకీయం కోసం వాడడం తప్పు..నారా నందమూరి హీరోస్ వైరల్ పోస్ట్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తూ.1986 విజయవాడలో మెడికల్‌ యూనివర్శిటీ స్థాపించబడింది.ఆంధ్రప్రదేశ్‌ లోని 3 ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య, విద్యను అందుబాటులోకి తీసుకురావాలని ఎన్టీఆర్‌ గారు ఈ మహావిద్యాలయనికి అంకురార్పణ చేయడం జరిగింది.క్రమంగా ఈ వైద్య ఆరోగ్య విశ్వవిద్యాలయం దేశంలోనే అత్యుత్తమంగా అభివృద్ధి చెందింది అని తెలిపారు కళ్యాణ్ రామ్.

అలాగే ఎంతోమంది వైద్య నిపుణులను దేశానికి అందించిందని, తెలుగు రాష్ట్రాలలో వైద్య అధ్యయనాలు మెరుగుదలకు ఆయన చేసిన కృషిని స్మరించుకోవడం కోసం ఈ విశ్వవిద్యాలయానికి డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అన్న పేరును మార్చబడింది అని కళ్యాణ్ రామ్ తెలిపారు.

అయితే ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కూడా 25 ఏళ్లకు పైగా ఉనికిలో ఉన్న ఈ ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం పేరు మార్చడం నాకు చాలా బాధ కలిగించింది.కేవలం రాజకీయ లాభం కోసం చాలా మందికి బావోద్వేగాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని ఇలా వాడుకోవటం తప్పు అని రాసుకొచ్చారు కళ్యాణ్ రామ్.అలాగే హీరో నారా రోహిత్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ ప్రభుత్వం నిర్ణయం పై కొంచె ఘాటుగా రియాక్ట్ అయ్యాడు.

రాజకీయ కారణాలతో మహనీయుల పేర్లు మార్చటం హుందాతనం కాదు.ఎన్టీఆర్ స్థాయిలో మరొకరు లేరు, రారు కూడా.ఆయన పేరును మార్చాలి అంటే తిరిగి ఆయన పేరే పెట్టాలి.ఇలాంటి పనులతో మీ స్థాయి దిగజారుతోంది తప్పితే ఆయన స్థాయికి ఏమి కాదు.

జోహార్ ఎన్టీఆర్ అంటూ రాసుకొచ్చాడు నారా రోహిత్.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube