నందమూరి ఫ్యామిలీ నుండి మరో బ్యానర్‌.. ఫ్యాన్స్ లో ఆతృత

టాలీవుడ్‌ లో పెద్ద ఫ్యామిలన్నింటికి కూడా నిర్మాణ సంస్థలు ఉన్నాయి.సొంత నిర్మాణ సంస్థల్లో తమ సినిమాలు మాత్రమే కాకుండా బయట హీరోలతో కూడా సినిమాలు చేయడం జరుగుతుంది.

 Nandamuri Family One More Banner Coming Soon , Balakrishna , Btrcreations , Fillm News , Nandamuri Family , Basavatarakarama Creations, Ntr , Nandamuri Family One More Banner-TeluguStop.com

ఈమద్య కాలంలో ఒక్క ఫ్యామిలీలో లెక్కకు మించిన నిర్మాణ సంస్థలు పుట్టుకు వస్తున్నాయి.మంచు వారి ఫ్యామిలీలో లక్ష్మి ప్రసన్న పిక్చర్స్ మాత్రమే కాకుండా మంచు విష్ణు ది ఒక సంస్థ.

మంచు మనోజ్ కు ఒక సంస్థ మరియు మంచు లక్ష్మికి ఒక సంస్థ అన్నట్లుగా మొత్తం నాలుగు సంస్థలు ఉన్నాయి.ఇక అక్కినేని వారు అన్నపూర్ణ స్టూడియోస్‌ బ్యానర్‌ తో పాటు మనం ఎంటర్‌ టైన్మెంట్స్ బ్యానర్‌ ను కూడా ఏర్పాటు చేశారు.

 Nandamuri Family One More Banner Coming Soon , Balakrishna , BTRCreations , Fillm News , Nandamuri Family , Basavatarakarama Creations, Ntr , Nandamuri Family One More Banner-నందమూరి ఫ్యామిలీ నుండి మరో బ్యానర్‌.. ఫ్యాన్స్ లో ఆతృత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పుడు నందమూరి ఫ్యామిలీలో కూడా ఇబ్బడి ముబ్బడిగా నిర్మాణ సంస్థలు పుట్టుకు వస్తున్నాయి.సీనియర్ ఎన్టీఆర్‌ ఉన్న సమయంలోనే నిర్మాణంలో అడుగు పెట్టారు.

రామకృష్ణ సినీ స్టూడియోను ఏర్పాటు చేసి అదే పేరు తో బ్యానర్‌ ను ఏర్పాటు చేసి సినిమాలను నిర్మించేవాడు.

ఆ తర్వాత హరికృష్ణ ఒక నిర్మాణ సంస్థ ను ఏర్పాటు చేయడం జరిగింది.

ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్‌ ఎన్టీఆర్‌ ఆర్ట్స్ అంటూ ఒక బ్యానర్‌ ను ఏర్పాటు చేసి వరుసగా సినిమాలను చేస్తున్నాడు.ఆ బ్యానర్ లు మాత్రమే కాకుండా బాలకృష్ణ ఎన్‌ బీ కే అనే బ్యానర్‌ ను మొదలు పెట్టి అందులో ఒకటి రెండు సినిమాలను నిర్మించాడు.

ఆయన సినిమాలు ప్లాప్‌ అవ్వడంతో మళ్లీ నిర్మాణంపై ఆసక్తి చూపడం లేదు.ఇప్పుడు కొత్తగా బసవతారకరామ క్రియేషన్స్ అనే కొత్త బ్యానర్ రాబోతుంది.ఇది ఎవరు ఏర్పాటు చేస్తున్నారు.దీంట్లో మొదటి సినిమా ఎవరితో… ఎవరి దర్శకత్వంలో అనే విషయంలపై చాలా ఆసక్తి నెలకొంది.

ఈనెల 28వ తారీకున ఈ నిర్మాణ సంస్థకు సంబంధించిన క్లారిటీ ఇవ్వబోతున్నట్లుగా ప్రకటించారు.ఈ బ్యానర్‌ లో ప్రొడక్షన్ నెం.1 గా రూపొందబోతున్న సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతోంది.మరో మూడు రోజుల్లో ఆ విషయమై క్లారిటీ వస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube