నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాల్లో రిలీజ్ కు రెడీగా ఉన్న మూవీ ”భగవంత్ కేసరి( Bhagavanth kesari )”.అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీలీల బాలయ్య కూతురుగా నటిస్తుంది.
ఇప్పటికే టీజర్ రిలీజ్ అవ్వగా ఒక్క టీజర్ తోనే అనిల్ బాలయ్యను ఎంత పవర్ఫుల్ గా చూపించ బోతున్నాడో అర్ధం అయ్యేలా తెలిపాడు.దసరా కానుకగా అక్టోబర్ 19న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్నట్టు అఫిషియల్ గా ప్రకటించారు.
షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.ఇక ఈ సినిమా ఇలా ఉండగానే నెక్స్ట్ సినిమా కూడా స్టార్ట్ చేసాడు బాలయ్య.
నటసింహం బాలకృష్ణ కెరీర్ లో 109వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు.

ఇప్పటికే అఫిషియల్ గా ప్రకటించిన ఈ సినిమా షూట్ స్టార్ట్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య ఎంట్రీ సీన్స్ కోసం రామోజీ ఫిలిం సిటీ( Ramoji Film City )లో భారీ సెట్ వేస్తున్నారట.బాలయ్య ఎంట్రీ సింహంతో ఫైటింగ్ తో మొదలవుతుందని ఈ సింహ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందని తెలుస్తుంది.

కాగా ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ అని ఇప్పటికే టాక్ వచ్చింది.అయితే ఈ సినిమాలో యాక్షన్ కంటే ఫ్యామిలీ ఎమోషన్స్ నే ఎక్కువగా ఉంటాయట.పైగా బాలయ్య( Balakrishna ) క్యారెక్టర్ ను కొత్తగా బాబీ చూపించ బోతున్నట్టు తెలుస్తుంది.ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఫార్చ్యూన్ 4 ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తుండగా నిర్మాతలుగా నాగ వంశీ, త్రివిక్రమ్ భార్య సౌజన్య వ్యవహరించ బోతున్నారు.