మహేష్ కి ఇష్టం లేకుండా ఒంటి పై టాటూ వేయించుకున్న నమ్రత..షాక్ లో మహేష్?

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటారు.అయితే ఇటీవల కాలంలో ఒంటిపై టాటూలు వేయించుకోవడం ట్రెండ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.

 Namrata Tattoo Secret Goes Viral In Social Media Details, Namrata,mahesh Babu,na-TeluguStop.com

ఎంతో మంది వారికి ఇష్టమైనటువంటి వాటిని టాటూలుగా వేయించుకుంటూ ఉంటారు.అయితే చాలామందికి ఇలా తమ శరీరంపై టాటూలు( Tattoos ) వేయించుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు వేరే వాళ్ళు వేయించుకున్న కూడా ఇష్టపడరు.

అలాంటి కోవలోకే సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) వస్తారు.ఈయన టాలీవుడ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నప్పటికీ తనకు ఇలా ఒంటిపై టాటూలు వేయించుకోవడం అంటే ఏమాత్రం ఇష్టం ఉండదని తెలుస్తుంది.

Telugu Mahesh Babu, Maheshbabu, Namrata, Namrata Tattoo, Sitara, Tollywood-Movie

అంతేకాకుండా తన కుటుంబ సభ్యులు కూడా టాటూలు వేయించుకుంటే ఈయనకు ఏమాత్రం నచ్చదట అందుకే నమ్రత( Namrata ) కానీ తన పిల్లలు కానీ ఇలాంటి వాటికి ఇష్టపడరు అని తెలుస్తుంది.కానీ మహేష్ బాబుకు ఇష్టం లేదని తెలిసినా కూడా నమ్రత టాటూ( Namrata Tattoo ) వేయించుకొని సాహసం చేశారని చెప్పాలి.నిజానికి నమ్రత మహేష్ బాబు కంటే వయసులో పెద్దది అయినప్పటికీ తన భర్తకు నచ్చని ఏ చిన్న పని కూడా చేయదు కానీ టాటూ విషయంలో మాత్రం మహేష్ బాబుకి ఇష్టం లేకపోయినా ఈమె తన శరీరంపై టాటూ వేయించుకున్నారని తెలుస్తోంది.

Telugu Mahesh Babu, Maheshbabu, Namrata, Namrata Tattoo, Sitara, Tollywood-Movie

ఇలా నమ్రత మహేష్ బాబుకి ఇష్టం లేదని తెలిసి తన భర్త పేరు వేయించుకున్నారనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.మహేష్ బాబు అంటే తనకు ఎంత ఇష్టమో అనే విషయాన్ని తెలియచేయడం కోసమే ఈమె తన భర్తకు ఇష్టం లేకపోయినా టాటూ వేయించుకున్నారట అయితే ఇది చూసిన మహేష్ సీరియస్ అయ్యారని తెలుస్తుంది కానీ ఆ టాటూ ద్వారా తనపై ఉన్నటువంటి ప్రేమను బయటపెట్టారు.ఇలా నమ్రత టాటూకి సంబంధించినటువంటి ఈ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

Telugu Mahesh Babu, Maheshbabu, Namrata, Namrata Tattoo, Sitara, Tollywood-Movie

ఇక వీరిద్దరూ కూడా ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.ఎంతో మంది సెలబ్రిటీలో ప్రేమ వివాహం చేసుకొని మనస్పర్ధలు కారణంగా విడిపోయారు కానీ వీరిద్దరూ మాత్రం కొన్ని కమిట్మెంట్స్ తో పెళ్లి చేసుకుని తమ వైవాహిక జీవితంలో ఎంతో చక్కగా సంతోషంగా ముందుకు సాగుతున్నారు అలాగే ఈ జంట ఎందరికో స్ఫూర్తిగా కూడా నిలిచారు.నమ్రత కూడా స్టార్ హీరోయిన్ అయినప్పటికీ పెళ్లి తర్వాత మహేష్ బాబు సూచనలు మేరకు సినిమాలకు దూరంగా ఉంటూ పిల్లల బాధ్యతలను వ్యాపారాలను చూసుకుంటూ ఒక సాధారణ గృహిణిగా గడుపుతూ ఈమె ఎందరితో ఆదర్శంగా ఉన్నారని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube