ఈరోజు కృష్ణ తొలి వర్ధంతి అనే సంగతి తెలిసిందే.సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) ఈ లోకాన్ని విడిచి ఏడాది అయిందనే విషయాన్ని ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
కృష్ణ సాధించిన రికార్డులలో ఎన్నో రికార్డులు ఇప్పటికీ ఎప్పటికీ బ్రేక్ చేయలేని రికార్డులు ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.కృష్ణ వారసుడు మహేష్ బాబు( Mahesh Babu ) వరుస విజయాలతో కెరీర్ ను కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
ఘట్టమనేని కుటుంబం కష్టాల్లో ఉన్న కుటుంబాలకు సాయం చేసే విషయంలో ముందువరసలో ఉంటుందనే సంగతి తెలిసిందే.కృష్ణ తొలి వర్ధంతి సందర్భంగా నమ్రత( Namrata ) మరో మంచి కార్యం దిశగా అడుగులు వేయడం గమనార్హం.
పేద విద్యార్థులకు చదువు చెప్పించాలని( Poor Students Education ) నమ్రత కీలక నిర్ణయం తీసుకున్నారు.నమ్రత అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించారు.మామయ్య గారి పేరుపై ఒక స్కాలర్ షిప్ కార్యక్రమాన్ని( Scholarship ) మొదలుపెడుతున్నామని నమ్రత చెప్పుకొచ్చారు.
ఇప్పటికే నలుగురు చురుకైన పేద విద్యార్థులను ఎంపిక చేశామని ఎంబీ ఫౌండేషన్( MB Foundation ) ఆ చిన్నారులను చదివిస్తుందని నమ్రత చెప్పుకొచ్చారు.వారు ఎంత చదువుకున్నా అందుకు అయ్యే ఖర్చును ఎంబీ ఫౌండేషన్ భరిస్తుందని ఆమె తెలిపారు.ప్రస్తుతం నలుగురిని మాత్రమే ఎంపిక చేశామని ఈ కార్యక్రమానికి మామయ్య ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నామని నమ్రత కామెంట్లు చేశారు.
ఈ నలుగురు విద్యార్థులు రాబోయే రోజుల్లో ఎంతమంది అవుతారో చెప్పలేమని నమ్రత అన్నారు.మాకు చేతనైనంత వరకు పేద విద్యార్థులను చదివించి వాళ్లకు అందమైన భవిష్యత్తుకు దారి చూపించే దిశగా అడుగులు వేస్తున్నామని నమ్రత తెలిపారు.నమ్రత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.నమ్రత చేసిన కామెంట్లకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
నమ్రత మంచి మనస్సు గురించి ఎంత చెప్పినా తక్కువేనని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.