పెళ్లి, అల్లు అర్జున్‌ విషయాలపై ఫుల్‌ క్లారిటీ ఇచ్చిన నగ్మ

1980, 90లలో స్టార్‌ హీరోలతో పోటీ పడి మరీ నటించిన ముద్దుగుమ్మ నగ్మ.తెలుగు, తమిళంలో దాదాపు అందరు స్టార్‌ హీరోలతో నటించిన ముద్దుగుమ్మ నగ్మ ఆ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లింది.

 Nagma Clarity About Movie With Allu Arjun And Her Marriage-TeluguStop.com

రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన నగ్మ మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని ఉంది అంటూ తాజాగా ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్బంగా చెప్పుకొచ్చింది.దాంతో అప్పటి నుండి త్రివిక్రమ్‌ తర్వాత మూవీలో అల్లు అర్జున్‌కు తల్లిగా నగ్మ నటించబోతుంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఆ వార్తల నేపథ్యంలో నగ్మ స్వయంగా మీడియాకు క్లారిటీ ఇచ్చింది.

తాజాగా ఒక సౌత్‌ మీడియా సంస్థకు నగ్మ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను సినిమాల్లో తిరిగి నటించాలనుకుంటున్న మాట వాస్తవమే.కాని ఇప్పటి వరకు తనను ఎవరు సంప్రదించలేదు.ప్రస్తుతం తాను రాజకీయాలతో బిజీగా ఉన్న కారణంగా సినిమాలు చేసే పరిస్థితి కూడా లేదు.

అల్లు అర్జున్‌తో మూవీ అంటూ వస్తున్న వార్తలు పూర్తిగా అబద్దం అంటూ క్లారిటీ ఇచ్చింది.త్రివిక్రమ్‌ మూవీలో సినిమా చేసే అవకాశం గురించి క్లారిటీ ఇచ్చిన నగ్మ తన పెళ్లిపై వస్తున్న పుకార్లకు కూడా చెక్‌ పెట్టింది.

45 ఏళ్ల వయసు వచ్చిన నగ్మ ఇంకా పెళ్లి చేసుకోలేదు.పెళ్లి వయసు దాటి పోయినా కూడా మీరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటూ ప్రశ్నించిన సమయంలో ఆమె వింతగా సమాధానం ఇచ్చింది.నా పెళ్లి నా చేతిలో లేదు, నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనే విషయాన్ని దేవుడు ఎప్పుడో నిర్ణయించి ఉంటాడు.అయితే ఆ సమయం ఇంకా రాలేదేమో అని నేను భావిస్తున్నాను.

అసలు నా జీవితంలో పెళ్లి అనేది రాసి ఉందో లేదో కూడా నాకు తెలియదు అంటూ నగ్మ చెప్పుకొచ్చింది.సందర్బం వచ్చినప్పుడు ఏది ఆగదు అని, వెంటనే జరిగి పోతుందని ఈ సందర్బంగా ఆమె చెప్పుకొచ్చింది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube