నాగార్జున (Nagarjuna ) అమల తర్వాత అంత ప్రాణంగా ప్రేమించిన హీరోయిన్ అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది టబు మాత్రమే.టబు తో ఆయన చాలా సీరియస్ రిలేషన్ లో ఉన్నారని అప్పట్లో ఎన్నో వార్తలు వినిపించాయి.
అంతేకాదు వీరి మధ్య రిలేషన్ వల్ల అమల (Amala) కి నాగర్జునకి మధ్య ఎన్నో గొడవలు కూడా తలెత్తాయి.ఒకానొక సమయంలో టబు తో ఉన్న సీరియస్ రిలేషన్ వల్ల నాగార్జున అమలకు దూరం అయ్యి విడాకులు తీసుకోవాలని చూశారట.
కానీ అమల మాత్రం దీనికి ఒప్పుకోలేదట.ఇక నాగార్జున కోసం టబు ఏకంగా ఓరోజు సూసైడ్ కూడా చేసుకుందని,కానీ తన బంధువుల సహాయంతో మళ్ళీ బతికి బయటపడిందని వార్తలు వినిపించాయి.
ఇక ఈ విషయం తెలిసి హుటాహుటిన నాగార్జున ముంబై వెళ్లి టబు (Tabu) ని పరామర్శించి వచ్చినట్లు కూడా అప్పట్లో ఎన్నో వార్తలు మీడియాలో వినిపించాయి.అయితే ఇప్పటికి కూడా వీరి మధ్య ఆ రిలేషన్ అలాగే ఉంది అని తెలుస్తోంది.
కానీ నాగార్జున వేరే అమ్మాయితో అంత పెద్ద రిలేషన్ లో ఉన్నా కూడా అమల ఎందుకు విడాకులు ఇవ్వలేదని చాలామంది అనుకుంటూ ఉంటారు.

అయితే అమల విడాకులు ఇవ్వకపోవడానికి కారణం అప్పటికే నాగార్జున మనస్తత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుందట.అంతేకాకుండా తనకు అఖిల్ పుట్టడం, అలాగే అక్కినేని ఫ్యామిలీ అనే ఒక పెద్ద బాధ్యత తన మీద ఉండడం, అంతేకాకుండా అన్నపూర్ణ స్టూడియో (Annapurna Studio) బాధ్యతలు ఇలా అన్ని తన చేతిలో ఉన్నాయి.

అంతేకాకుండా ఎంతమందితో ఎఫైర్ పెట్టుకున్నా కూడా నాగార్జున (Nagarjuna) భార్య స్థానంలో ఎప్పటికీ తనే ఉంటుంది అని ఒకే ఒక్క నమ్మకంతో నాగార్జున ఎన్నిసార్లు విడాకులు అడిగినా కూడా అమల దానికి ఒప్పుకోలేదట.కానీ రోజులు గడుస్తున్నా కొద్ది అమలకి తన మీద ఉన్న ప్రేమని అర్థం చేసుకున్న నాగార్జున టబు ని దూరం పెట్టారట.ఇలా నాగార్జునకి ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లతో అలాంటి వార్తలు వినిపించినా కూడా అమల వాటిని పట్టించుకోదట.







