టాలీవుడ్ కింగ్ నాగార్జున ఈ ఏడాది ఆరంభం లో బంగార్రాజు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
నాగార్జున తో పాటు ఆ సినిమా లో నాగ చైతన్య కూడా నటించాడు.ఇప్పుడు నాగార్జున ది ఘోస్ట్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు గాను సిద్ధం అయ్యాడు.
హీరోగా నాగార్జున ఈమధ్య చేస్తున్న సినిమా లు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.అయినా కూడా ఏమాత్రం వెనక్కు తగ్గకుండా నాగ్ సినిమా ల పరంపర కొనసాగుతూనే ఉంది.
హీరోగా నాగార్జున ఎన్నో అడ్వంచర్ సినిమా లు చేశాడు.ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా ఉండబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ గా జరుగుతున్న నేపథ్యం లో సెప్టెంబర్ లోనే సినిమా విడుదల అయ్యే అవకాశం ఉందని క్లారిటీ వచ్చింది.
ఘోస్ట్ సినిమా కు ప్రవీన్ సత్తారు దర్శకత్వం వహించగా.
సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే.ఈ సినిమా తో పాటు నాగార్జున బ్రహ్మాస్త్ర సినిమా కూడా సెప్టెంబర్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంటున్నారు.
అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది.

కాని ఇప్పటి వరకు ది ఘోస్ట్ యొక్క అఫిషియల్ అనౌన్స్మెంట్ రాలేదు.కనుక ఎప్పుడెప్పుడు ఆ సినిమా డేట్ వస్తుందా అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.నాగార్జున బ్రహ్మాస్త్ర లో కీలక పాత్రలో నటించాడు.
అది ఆయన హీరోగా నటించిన సినిమా కాదు.కనుక రెండు వారాల గ్యాప్ లో ది ఘోస్ట్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటూ సమాచారం అందుతోంది.