నాగార్జున ఆటలో అరటిపండు కాదు

డిక్టేటర్, నాన్నకు ప్రేమతో సంక్రాంతి బరిలో ఉండబోతున్నట్లు చాలా ముందుగా ప్రకటించారు.డిసెంబరు వచ్చేవరకు ఎవరికి తెలీదు, నాగార్జున కూడా సంక్రాంతి బరిలో ఉండబోతున్నట్లు.

 Nagarjuna To Emerge As Sanktanthi Winner-TeluguStop.com

నాగార్జున తప్పుడు నిర్ణయం తీసుకున్నారని, అసలు ఎన్టీఆర్, బాలకృష్ణ లాంటి మాస్ హీరోలు ఉండగా ప్రేక్షకులు నాగ్ ని ఎందుకు పట్టించుకుంటారనే కామెంట్లు చాలానే వినిపించాయి.కాని నేనేమి ఆటలో అరటిపండు కాదని నిరూపించుకున్నారు నాగార్జున.

నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, ఎక్స్‌ప్రెస్ రాజా, ఈ మూడు చిత్రాలు ఒకవైపు, సొగ్గాడే చిన్నినాయన చిత్రం ఒక్కటే మరోవైపు.ఆ మూడు చిత్రాలకు ప్రమాదమై కూర్చున్నారు నాగార్జున.

మన బంగార్రాజు నిన్న అందరిని డామినేట్ చేసేసాడు.

సొగ్గాడే చిన్నినాయన భారి విజయంవైపు పరుగులు పెడుతోంది.

సంక్రాంతి పోటీలో విజేతగా నిలిచేది నాగర్జునే అంటున్నారు ట్రేడ్ పండితులు.సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన అలా ఉంది.

ఎన్టీఆర్ మార్కేట్ పెద్దది కాబట్టి నాన్నకు ప్రేమతో ఎక్కువ కలెక్ట్ చేస్తుంది కాని, బయ్యర్లందరికి లాభాలు తెచ్చిపెట్టేది మాత్రం అక్కినేని అందగాడే అని ట్రేడ్ అంచనా.

కాంగ్రాట్స్ కింగ్ నాగార్జున గారు.

సంక్రాంతి పోరులో విజేత మీరే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube