ఆ కంటెస్టెంట్ విన్నర్ కాదని నాగార్జున డైరెక్ట్ గా చెప్పేశారా.. అసలేం జరిగిందంటే?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా ఉంటుందనే సంగతి తెలిసిందే.

ఈ షో ద్వారా ఎంతోమంది కంటెస్టెంట్లు అభిమానులకు దగ్గర కాగా కొంతమంది కంటెస్టెంట్లు మాత్రం విమర్శలపాలయ్యారు.

అయితే అమర్ దీప్( Amardeep Chowdary ) బిగ్ బాస్ షో విన్నర్ కాదని నాగార్జున డైరెక్ట్ గా చెప్పేశారని సోషల్ మీడియా వేదికగా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.అందుకు సంబంధించిన సాక్ష్యాలను కూడా చూపిస్తున్నారు.

మీమ్స్ టాస్క్ లో భాగంగా సరె సర్లే ఎన్నెన్నో అనుకుంటాం.అన్నీ జరుగుతాయా ఏంటి.అనే మీమ్ ను శివాజీ అమర్ దీప్ కు చెప్పగా అమర్ దీప్ విన్నర్ కావాలని కలలు కంటున్నాడని ఆ కల నిజం అయ్యే ఛాన్స్ లేదని నాగ్ ఈ విధంగా క్లారిటీ ఇచ్చేశారని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి.

అమర్ దీప్ కెప్టెన్ కావాలని కన్న కల నెరవేరకపోవడంతో చివరకు నాగార్జున( Nagarjuna ) అమర్ దీప్ ను కెప్టెన్ గా ప్రకటించారు.

Advertisement

నాగార్జున చేసిన మరికొన్ని కామెంట్లు సైతం అమర్ దీప్ విన్నర్ కాడని చెప్పకనే చెప్పేశాయని నెటిజన్లు చెబుతున్నారు.ఉల్టా పుల్టా కాన్సెప్ట్ తో వచ్చిన బిగ్ బాస్ 7 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకుంటాయో చూడాలి.బిగ్ బాస్ సీజన్7 ప్రేక్షకులకు ఊహించని స్థాయిలో ఎంటర్టైన్మెంట్ ను అందించింది.

నాగ్ హోస్ట్ గా కూడా ఎంతగానో ఆకట్టుకున్నారు.నాగార్జున అభిమానులను మెప్పిస్తుండటంతో పాటు తన షో ద్వారా సినిమాల ప్రమోషన్స్ కూడా వేరే లెవెల్ లో చేస్తున్నారు.

బిగ్ బాస్ షో తెలుగు స్టార్ మా ఛానెల్ స్థాయిని సైతం పెంచింది.బిగ్ బాస్ షో మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకోవడంతో ఈ షో నిర్వాహకులు సైతం ఎంతో సంతోషిస్తున్నారని తెలుస్తోంది.

అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...
Advertisement

తాజా వార్తలు