నాగార్జున 'శివ' చిత్రం హిందీ లో ఎంత వసూళ్లను రాబట్టిందో చూస్తే ఆశ్చర్యపోతారు!

పాన్ ఇండియన్ మార్కెట్ అనేది ఇప్పుడు క్రేజీ గా మారిపోయింది.చిన్న హీరోల దగ్గర నుండి పెద్ద హీరోల వరకు ప్రతీ ఒక్కరు ఇప్పుడు పాన్ ఇండియా మీదనే కన్నేశారు.

 Nagarjuna Ram Gopal Varma Shiva Movie Hindi Collections Details, Nagarjuna, Ram-TeluguStop.com

కొన్ని చిన్న సినిమాలు ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ లు సాధించాయి, కొన్ని పెద్ద సినిమాలు అయితే పాన్ ఇండియా లెవెల్ లో అద్భుతాలే నెలకొల్పాయి.గత కొంత కాలంగా ఇది మనం చూస్తూనే ఉన్నాం.

ఈ పాన్ ఇండియన్ సినిమాలకు మన టాలీవుడ్ నుండి రోడ్ వేసింది రాజమౌళి( Rajamouli ) అని అనుకుంటూ ఉంటాం.ఈ జనరేషన్ కి ఆయనే రోడ్డు వేసి ఉండొచ్చు.

కానీ పాన్ ఇండియన్ మార్కెట్ కి మన టాలీవుడ్ నుండి చిరంజీవి( Chiranjeevi ) మరియు నాగార్జున( Nagarjuna ) ఎప్పుడో రోడ్డు వేశారు.మిగిలిన హీరోలు ఆ రోడ్ లో నడిచే సాహసం చేయలేకపోయారు అంతే.

గతం లో చిరంజీవి మరియు నాగార్జున బాలీవుడ్ ని సూపర్ హిట్ చిత్రాలతో ఒక ఊపు ఊపేసారు.

Telugu Bollywood, Nagarjuna, Nagarjuna Shiva, Ram Gopal Varma, Shiva, Shiva Hind

ముఖ్యంగా అక్కినేని నాగార్జున నటించిన ‘శివ’ చిత్రం( Shiva Movie ) గురించి మనం మాట్లాడుకోవాలి.రామ్ గోపాల్ వర్మ( Ram Gopal Varma ) దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా తెలుగు లో ఉన్న రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.ఇదే సినిమాని హిందీ లో డబ్ చేసి విడుదల చేశారు.

అక్కడ కూడా సెన్సేషనల్ హిట్ అయ్యింది.ఇంత డిఫరెంట్ టేకింగ్ తో సినిమా తీసినందుకు రామ్ గోపాల్ వర్మని, అలాగే అద్భుతంగా నటించినందుకు అక్కినేని నాగార్జున ని పొగడ్తలతో ముంచి ఎత్తేసారు బాలీవుడ్( Bollywood ) విమర్శకులు.

అప్పట్లో ఈ సినిమా హిందీ లో దాదాపుగా నాలుగు కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు, 8 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఒక తెలుగు డబ్బింగ్ సినిమాకి అక్కడ అప్పట్లో ఆ రేంజ్ వసూళ్లు రావడం శివ సినిమాకే జరిగింది అట.

Telugu Bollywood, Nagarjuna, Nagarjuna Shiva, Ram Gopal Varma, Shiva, Shiva Hind

ఈ చిత్రం తర్వాత రామ్ గోపాల్ వర్మ కి టాలీవుడ్ లో కంటే ఎక్కువగా బాలీవుడ్ లోనే అవకాశాలు వచ్చాయి.అక్కడ ఆయన పెద్ద స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.అక్కడే ఎక్కువగా సినిమాలు చేస్తూ, మద్యమద్యలో టాలీవుడ్ సినిమాలు చేసేవాడు.ఇక నాగార్జున కి కూడా ఈ సినిమా తర్వాత బాలీవుడ్ లో ఎన్నో అవకాశాలు వచ్చాయి.

అమితాబ్ బచ్చన్ , అనిల్ కపూర్, అక్షయ్ కుమార్ వంటి హీరోలతో కలిసి ఆయన బాలీవుడ్ లో మల్టీస్టార్రర్ సినిమాలు చాలానే చేసాడు.అలా శివ చిత్రం ఈ ఇద్దరికీ బాలీవుడ్ లో మంచి మార్కెట్ ని ఏర్పాటు చేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube