నాగార్జున ( Nagarjuna )హీరోగా రూపొందుతున్న నా సామి రంగ సినిమా( Naa Saami Ranga ) సంక్రాంతికి వస్తుందా లేదా అనే అనుమానం వ్యక్తం అవుతున్న ఈ సమయంలో కన్ఫర్మ్ అయింది.సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో శరవేగంగా జరుగుతోంది.
అంతే కాకుండా సినిమా యొక్క టీజర్ ను వారం రోజుల లోపు విడుదల చేయబోతున్నారు. నాగార్జున తో పాటు ఈ సినిమా లో అల్లరి నరేష్ మరియు రాజ్ తరుణ్ లు నటిస్తున్నారు.
వారిద్దరికి సంబంధించిన గ్లిమ్స్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు.రేపు అల్లరోడు వస్తుండగా, ఆ వెంటనే రాజ్ తరుణ్ వస్తాడు.
ఆ వెంటనే సినిమా టీజర్ ను విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.మొత్తానికి నా సామి రంగ సినిమా ప్రమోషన్ ను మొదలు పెట్టడం తో సినిమా కచ్చితంగా విడుదల అవ్వబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.సినిమా షూటింగ్ ను క్రిస్మస్ వరకు పూర్తి చేయాలని భావిస్తున్నారట.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ భారీ మల్టీ స్టారర్ ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.
ప్రస్తుతం సినిమా యొక్క షూటింగ్ పైనే దృష్టి పెట్టకుండా మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జరుపుతున్నారు.
సంక్రాంతికి అంటూ ఇప్పటి వరకు ప్రకటించారు.అయితే రేపు సినిమా విడుదల తేదీ పై కూడా క్లారిటీ ఇవ్వబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇక నా సామి రంగ సినిమా రీ మేక్ అనే వార్తలు వస్తున్నాయి.
ఆ విషయమై క్లారిటీ ఇవ్వలేదు.కానీ త్వరలోనే మీడియా ముందుకు వచ్చే సినీ యూనిట్ సభ్యులు క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
ఈ మధ్య కాలంలో నాగార్జున( Nagarjuna ) సినిమా లు హిట్ అవ్వడం లేదు.మరి ఈ సినిమా తో అయినా సక్సెస్ లు అయ్యేనా చూడాలి.