నాగార్జున చేజార్చుకున్న టాప్ మూవీస్ ఏంటో తెలుసా?

సినిమాల విషయంలో నాగార్జున చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు.ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందు ఎన్నో రకాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాడు.

శివ, గీతాంజలి లాంటి విజయాల తర్వాత ఆయనతో సినిమాలు చేసేందుకు ఎంతో మంది క్యూ కట్టారు.కానీ తను అడ్డగోలుగా సినిమాలకు ఓకే చెప్పలేదు.

తనకు నచ్చిన సినిమాలకు మాత్రమే సరే అన్నాడు.అయితే నాగార్జున తన కెరీర్ లో పలు సినిమాలకు నో చెప్పాడు.

ఇంతకీ అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఘర్షణ

Advertisement

మణిరత్నంతో సినిమా చేయాలని నాగ్ చాలాసార్లు అనుకున్నాడు.కెరీర్ మొదట్లోనే ఘర్షణ సినిమా చేయాలని మణిరత్నం కోరాడు.కానీ అనుకోని కారణాలతో ఈ సినిమా చేయలేకపోయాడు.1988లో తనకు ఈ ఆఫర్ రాగా వదులుకున్నాడు.మరుసటి ఏడాది మణిరత్నంతో కలిసి గీతాంజలి సినిమా చేశాడు.

మెకానిక్ అల్లుడు

నాగార్జున చేయాల్సిన ఈ సినిమా చిరంజీవి చేశాడు.బి గోపాల్, నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన సినిమాల ట్రాక్ రికార్డు సరిగా లేకపోవడంతో ఈ సినిమాను వద్దనుకున్నాడు నాగార్జున.

ఆర్జీవీ రామాయణం

సుమారు 10 ఏండ్ల క్రితం ఆర్జీవీ రామాయణం సినిమా చేయాలనుకున్నాడు.

హీరోగా నాగార్జునను సంప్రదించాడు.కానీ ఆర్జీవీ పరిస్థితి కారణంగా నో చెప్పాడు.

నాన్ రుద్రన్

ధనుష్ తో కలిసి చేయాల్సిన మల్టీ స్టారర్ మూవీ నాన్ రుద్రన్ కు నాగార్జున నో చెప్పాడు.ఈ సినిమ షూటింగ్ మొదలైన కొద్ది రోజులకే ఆగిపోయింది.

మౌన రాగం

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను కెరీర్ తొలినాళ్లలో నాగ్ చేజార్చుకున్నాడు.ఈ సినిమ అప్పట్లో మంచి విజయం సాధించింది.

కలిసుందాం రా

Advertisement

దర్శకుడు ఉదయ్ శంకర్ ఈ సినిమాను ముందుగా నాగార్జునతో చేయాలి అనుకున్నాడు.కానీ రొటీన్ స్టోరీ అని వదిలేశాడు.అదే సినిమాను వెంకటేష్ చేశాడు.

ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.

బద్రి

ఈ సినిమా కథను పూరీ జగన్నాథ్ ముందుగా నాగార్జునకు చెప్పాడు.కానీ తను ఏ విషయం చెప్పకపోవడంతో పవన్ తో చేసి హిట్ కొట్టాడు.

దళపతి

మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌ బస్టర్ మూవీ దళపతి.ఈ సినిమా కథ కూడా ముందు నాగార్జునకే చెప్పాడు.కానీ ఆయన ఎందుకో చేయలేనని చెప్పాడు.

తాజా వార్తలు