అనుకున్నట్టుగానే గాడ్ ఫాదర్ హిట్ తో మరోసారి తాను రీమేక్ స్పెషలిస్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు డైరక్టర్ మోహన్ రాజా.ఆయన డైరెక్ట్ చేసిన సినిమాల్లో చాలావరకు రీమేక్ లే ఉన్నాయి.అందుకే అతన్ని కావాలని పిలిపించాడు చిరంజీవి.గాడ్ ఫాదర్ హిట్ తో ఈ తమిళ దర్శకుడికి తెలుగులో డిఉమాండ్ ఏర్పడింది.ఆయనతో సినిమా చేయాలని స్టార్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.ఈ క్రమంలో కింగ్ నాగార్జున కూడా మోహన్ రాజా డైరక్షన్ లో సినిమా చేయాలని చూస్తున్నారట.
గాడ్ ఫాదర్ సినిమా హిట్ తో తన డైరక్షన్ టాలెంట్ ఏంటో చూపించిన మోహన్ రాజాతో నాగార్జున సినిమా ప్లాన్ చేస్తున్నారట.ఈ సినిమాలో అఖిల్ కూడా నటిస్తాడని టాక్.
అఖిల్, నాగార్జున కలిసి చేసే అక్కినేని క్రేజీ మల్టీస్టారర్ సినిమాగా ఈ ప్రాజెక్ట్ వస్తుందట.ప్రస్తుతం అఖిల్ ఏజెంట్ సినిమా చేస్తున్నాడు.
ఆ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కి గానీ 2023 సంక్రాంతి బరిలో గానీ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి మోహన్ రాజాతో నాగార్జున మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి.
ఈ ప్రాజెక్ట్ కి సంబందించిన మరింత సమాచారం త్వరలో బయటకు రానుంది.