టాలీవుడ్ అగ్రతారాలలో ఒకరైన అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) తాజాగా ఓ అభిమానికి క్షమాపణలు సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
అయితే ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.
ప్రస్తుతం తమిళ హీరో ధనుష్( Dhanush ) సినిమాలో నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో హీరో ధనుష్ తో పాటు నాగార్జున కూడా ఎయిర్పోర్ట్ లో కలిసి నడుస్తున్నారు.
అయితే అక్కడే పనిచేస్తున్న ఓ పెద్ద వయసు గల వ్యక్తి హీరో నాగార్జునను చూస్తేనే అతడితో మాట్లాడాలని భావించి ఆయనకు దగ్గరగా వెళ్ళాడు.అయితే హీరోలకు సెక్యూరిటీ గార్డ్స్( Security Guards ) వెంటనే స్పందించి అతడిని అక్కడ నుంచి బయటకు నెట్టివేశారు.
దీంతో అతడు కింద పడిపోయేలా కనిపించినా చివరికి తట్టుకొని నిలబడ్డాడు.ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ వీడియో కాస్త నాగార్జున దృష్టికి వెళ్ళింది.దీంతో నాగార్జున ఆ వీడియోని షేర్ చేస్తూ తన క్షమాపణలు తెలియజేశాడు.
నాగార్జున సోషల్ మీడియా ద్వారా ఇప్పుడే ఈ వీడియో నా దగ్గరికి వచ్చింది.ఇలా జరిగి ఉండకూడదు.
ఇలాంటివి ముందు ముందు జరగకుండా చూసుకుంటాను.అతడికి క్షమాపణలు అంటూ పోస్ట్ చేశాడు.
దీంతో నెటిజన్స్ నాగార్జున పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
ఇక ఈ పోస్టుకు సంబంధించి నెటిజెన్స్ కామెంట్ చేస్తూ.తప్పు చేసింది సెక్యూరిటీ గార్డ్స్ వారి కోసం మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని అంటుండగా మరికొందరైతే.మీరు సినిమాల్లోనే కాదు రియల్ జీవితంలో కూడా హీరోనే అంటూ ఆయనను పొగడ్తలతో ముంచెత్తారు.
ప్రస్తుతం నెట్టింట ఈ ట్వీట్ వైరల్ గా మారింది.ఇక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర సినిమాలో( Kubera Movie ) నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy