నాగార్జున, చిరంజీవి మధ్య పోటీకి కారణం అదే.. ఎవరి సినిమా హిట్టు? ఎవరి సినిమా ఫట్టు?

సీనియర్ హీరోలు అయినా నాగార్జున, చిరంజీవి మధ్య ఉన్న స్నేహబంధం గురించి మనందరికీ తెలిసిందే.

ఇప్పటికే పలుసార్లు వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం గురించి బయటపడిన విషయం తెలిసిందే.

అప్పటి నుంచే కూడా వీరిద్దరి మధ్య స్నేహబంధం కొనసాగుతూనే ఉంది.ఆ స్నేహబంధం కారణంగానే ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎప్పుడూ కూడా క్లాష్ అవ్వరు.

కాగా ఈ ఏడాది దసరా పండుగ రోజున అనగా అక్టోబర్ 5వ తేదీన నాగార్జున నటించిన ది గోస్ట్ సినిమా, మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలు ఒకేసారి విడుదల కానున్నాయి.మెగాస్టార్ నటించిన సినిమా మలయాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

అయితే ఈ రెండు సినిమాలపై అంచనాలు కూడా సమాన స్థాయిలో ఉన్నాయి.దీంతో అభిమానులు ఈ పోటీ అంత సేఫ్ కాదు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

కాగా గాడ్ ఫాదర్ టీజర్ బాగానే ఉంది అని అనిపించినప్పటికీ పలు రకాల నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి.ఇకపోతే నాగార్జున విషయానికి వస్తే.

వైల్డ్ డాగ్ సినిమా డిజాస్టర్ అయిన తర్వాత నాగార్జున మరొకసారి ఇంగ్లీష్ టైటిల్ తో ది గోస్ట్ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతున్నాడు.

అయితే ఇద్దరి హీరోలలో ఎవరో ఒకరు ముందు వెనుక వస్తే బాగుండేది అనుకుంటే సెప్టెంబర్ 30న పొన్నియన్ సెల్వన్ సినిమా విడుదల కాండడంతో ఈ ఒకటి ముందుగా విడుదల చేయలేని పరిస్థితి నెలకొంది.ఒకవేళ ఎవరైనా ఒక డ్రాప్ అవుదాము అంటే మళ్ళీ డిసెంబర్ వరకు కూడా డేట్స్ దొరకని పరిస్థితి.కాబట్టి అక్టోబర్ 5న చిరు, నాగ్ ఇద్దరూ కూడా బాక్సాఫీస్ వద్ద పోటీ పడబోతున్నారు.

అయితే గతంలో వీరిద్దరూ బాక్సాఫీస్ వద్ద ఒకేసారి తలపడిన దాఖలాలు అంతగా లేవు అని చెప్పవచ్చు.కాగా వీరిద్దరూ బాక్స్ ఆఫీస్ వద్ద తలపడబోతుండగా అందులోనూ ఇంగ్లీష్ టైటిల్ లతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధం అవ్వడం విశేషం.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

మరి ఈ ఇద్దరు మిత్రులు ఎవరు గెలుస్తారో ఎవరు ఓడుతారో చూడాలి మరి.

Advertisement

తాజా వార్తలు