తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నాగార్జున ఈ వయసులో కూడా అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
కాగా నాగార్జున గత ఏడాది బంగార్రాజు, బ్రహ్మస్త్ర, ది ఘోస్ట్ సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.అయితే భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాలు ఊహించిన విధంగా బాక్సాఫీస్ వద్ద నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్నాయి.
ఈ మూడిట్లో బంగార్రాజు సినిమా పరవాలేదు అనిపించింది.అయితే గత ఏడాది మూడు సినిమాలు పరాజయం పాలవడంతో ప్రస్తుతం మూడు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు నాగార్జున.

ఈ నేపథ్యంలోనే నాగార్జున తన 99 వ సినిమాను ప్రసన్న కుమార్ జెజవాడతో చేస్తున్నారు.ఇక ఆ సినిమా తర్వాత ఆయన తన 100వ సినిమాను మోహన్ రాజాతో కలిసి చేయనున్నారు.అలాగే నాగార్జున తన 101వ సినిమా కోసం ఓ మలయాళీ సినిమాను రీమేక్ చేస్తున్నారు.మలయాళంలో పొరింజు మరియం జోస్ అనే సినిమాను తెలుగులో నాగార్జున చేయనున్నారు.
ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్ నిర్మించనున్నారని తెలుస్తోంది.గత ఏడాది సరైన హిట్ పడకపోవడంతో ఈ మూడు సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.
అంతేకాకుండా తన తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా కూడా తీసుకుంటున్నారు నాగార్జున.

ఈ క్రమంలోనే రచయిత ప్రసన్న కుమార్ బెజావాడ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు ఎలా అయిన హిట్ కొట్టాలని కసిగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు నాగ్.ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్‌ను జరుపుకుంటోంది.అయితే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ తొందరగా పూర్తి చేసే విడుదల చేయాలని భావిస్తున్నారు.
ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాలో నాగార్జునతో పాటు అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఈ చిత్రం తెరకెక్కబోతోంది.








