Shivlingam Srikalahasti : శివలింగం చుట్టూ ప్రదక్షిణలు చేసిన నాగరాజు.. ఎక్కడంటే..

ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల సంవత్సరాల క్రితం నాటి ఆలయాలు ఉన్నాయి.ఈ దేవాలయాలకు ప్రతిరోజు భక్తులు వెళ్లి పూజలు, అభిషేకాలు చేస్తూనే ఉంటారు.

ఇలాంటి దేవాలయాలకు మనుషులే కాకుండా అప్పుడప్పుడు కొన్ని ప్రత్యేకమైన జంతువులు కూడా వచ్చి పూజలు ప్రదక్షిణలు చేయడం చూసే ఉంటారు.ఇంకా చెప్పాలంటే ఈ భూమి మీద ఉన్న దాదాపు ప్రతి అణు అణువునా దైవం ఉన్నాడని భావించేవారు చాలామంది ఉన్నారు.

ఇంకా చెప్పాలంటే ఆవు, కుక్క, కాకి,నాగ పాము ఇలాంటి అనేక జంతువులను, అలాగే పక్షులను కూడా దైవంగా భావించి పూజిస్తూనే ఉన్నాము.హిందూ ధర్మంలో నాగ పాముకు ప్రత్యేక స్థానం ఉంది.

ఎందుకంటే ఏడు లోకాల్లో ఒక లోకం నాగలోకం అని చెబుతారు.అమృతం కోసం పాల కడలిని చిలికిన సమయంలో వాసుకి అనే సర్పం ఎంతో సహాయం చేసింది.

Advertisement
Nagaraju Who Circumambulated The Shivlingam Where , Nagaraju, Shivlingam, Srikal

శివుడి మెడలో కంఠాభరణం నాగ పాము, శ్రీ విష్ణువు పాన్పు ఆదిశేషుడు ఇలా పాముల గురించి పురాణాల్లో ఎన్నో కథలు ఉన్నాయి.శ్రీకాళహస్తి క్షేత్రంలో బోళ శంకరుడి పూజను ఒక పాము చేసింది.

Nagaraju Who Circumambulated The Shivlingam Where , Nagaraju, Shivlingam, Srikal

అయితే తాజాగా ఒక శివాలయంలో పెద్ద నాగపాము ప్రత్యక్షమై పూజ చేసింది.ఇది ఎక్కడో కాదు మన తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా దోమకొండ శివారులోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయం లో నాగ పాము ప్రత్యక్షమై భక్తులను అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.ఇక్కడ శివుడి తనయుడు సుబ్రహ్మణ్య స్వామి తో పాటు అనేక ఉప ఆలయాలు కూడా ఉండడం విశేషం.

అయితే తాజాగా శివాలయంలోని గర్భగుడిలోకి నాగపాము వచ్చి కాసేపు లింగాన్ని చుట్టుకొని, అనంతరం లింగం చుట్టూ సుమారు గంటపాటు ప్రదక్షిణలు చేసింది.ఈ వింతను చూడడానికి అలాగే శివయ్యను దర్శించుకోవడానికి భారీగా భక్తులు ఆలయానికి వచ్చారు.

శివనామ స్మరణంతో ఆలయ ప్రాంతం మార్మోగిపోయింది.ఆ తర్వాత ఆ నాగరాజును ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకొని అడవి ప్రాంతంలో విడిచిపెట్టారు.

తనను తానే కిడ్నాప్ చేసుకొని 6 నెలలు దాక్కొన్న టాలీవుడ్ హీరోయిన్ సదా..!

ఈ సంఘటనకు ఈ వింత సంఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు