చందు మొండేటి( Chandu mondeti ) దర్శకత్వంలో సాయి పల్లవి, నాగ చైతన్య( Sai Pallavi, Naga Chaitanya ) కలిసి నటించిన తాజా చిత్రం తండేల్.ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాకు ఒక కలెక్షన్ లు కూడా బాగానే వచ్చాయి.
చూస్తుండగానే వీకెండ్ ముగిసిపోయింది.తండేల్ సినిమా రిజల్ట్ కూడా తేలిపోయింది.
అయితే సినిమాలో పాకిస్థాన్ ఎపిసోడ్స్ పై అభ్యంతరాలు ఉన్నప్పటికీ సినిమా సక్సెస్ అయింది.ప్రస్తుతం మూవీ మేకర్స్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమా నాగచైతన్య కలలను నెరవేర్చలేక పోయిందట.ఈ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు ఆశించాడట.చైతూ.కార్తికేయ 2 లాంటి సినిమాను అందించిన చందు మొండేటి సహకారంతో నార్త్ లో కూడా పాపులర్ అవ్వాలని అనుకున్నాడు.కానీ అలా జరగలేదు.తండేల్ హిందీ వెర్షన్ కు పేలవమైన రివ్యూస్ రావడమే కాదు, వసూళ్లు కూడా అలానే ఉన్నాయని చెప్పాలి.
మొదటి రోజే ఆక్యుపెన్సీ లేక కొన్ని షోలు క్యాన్సిల్ అవ్వగా వీకెండ్ ముగిసేసరికి తండేల్ హిందీ వెర్షన్ కూడా తేలిపోయింది.అలా చైతూ పాన్ ఇండియా కలలకు బ్రేక్ పడింది.
బాలీవుడ్ సంగతి పక్కన పెడితే.

ఎప్పటినుంచో మంచి విజయం కోసం చూస్తున్న నాగచైతన్యకు ఈ సినిమాతో మంచి సక్సెస్ అందింది.తను తీసుకున్న నిర్ణయం, పడిన శ్రమకు తగిన గుర్తింపు పొందాడు.ఉన్న ఫలంగా పైరసీని అరికడితే ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని వసూళ్లు రావడం ఖాయం.విడుదలైన 3 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రూ.62.37 కోట్లు గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించుకున్నారు.మరి ముందు ముందు ఈ సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో చూడాలి మరి.