పేర్ని నాని పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన నాగబాబు..!!

వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పేర్ని నాని పై జనసేన పార్టీ కీలక నేత నాగబాబు సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

వైసీపీలో పేర్ని నాని నోటి విరోచనాలతో బాధపడుతున్నారని సెటైర్లు వేశారు.

పవన్ కళ్యాణ్ పెట్టిన తిండి సరిగా అరగక నోటికి వచ్చినట్లు వాగుతున్నారు అని అన్నారు.అప్పుడప్పుడు వైసీపీ నాయకులకు సాత్వికమైన ఆహారాన్ని పవన్ కళ్యాణ్ పెట్టాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు.

ఇదే సమయంలో బంధరులో మంచి వైద్యుడు ఎవరైనా ఉంటే.పేర్ని నానినీ చూపించాలని ఆయన నోటి విరోచనాలకు మందు ఇవ్వాలని కోరుతున్నట్లు స్పష్టం చేశారు.

దీంతో నాగబాబు చేసిన కామెంట్లు  ఏపీ రాజకీయాల్లో పెను దుమారాన్ని రేపాయి.అంతకుముందే పేర్ని నాని పవన్ కళ్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

Advertisement

కొన్ని కోట్ల సంపాదన వదులుకొని ప్రజాసేవ కోసం వచ్చేసానని అప్పట్లో పవన్ డైలాగులు వేశారు.ఇప్పుడు సినిమాలు చేసుకుంటూ వీకెండ్ రాజకీయాలు చేస్తున్నారని అన్నారు.

దీంతో పేర్ని నాని వ్యాఖ్యలపై నాగబాబు ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

Advertisement

తాజా వార్తలు