వైజాగ్ నుండి నాగబాబు పోటీ.. మరి భరత్ పరిస్థితేంటి!

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి.టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖరారైంది.

 విశాఖ రాఘవరావు జనసేన పార్టీ, వ-TeluguStop.com

కూటమి రూట్ మ్యాప్ కూడా రూపుదిద్దుకున్నట్లు ఇరు రాజకీయ పార్టీల్లోని ముఖ్య నేతలు పేర్కొన్నారు.ప్రస్తుత సమాచారం ప్రకారం వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి విశాఖపట్నం పార్లమెంట్ స్థానాన్ని కేటాయించాలని పవన్ కోరినట్లు సమాచారం.

దానికి టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు కూడా ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తుంది.

గత  ఎన్నికల్లో విశాఖ సీటును టీడీపీ గెలుచుకోలేకపోయింది.2009లో వైజాగ్ పార్లమెంట్ స్థానం నుంచి పురంధేశ్వరి (కాంగ్రెస్) గెలుపొందగా, 2014లో కంభంపాటి హరిబాబు (బీజేపీ), 2019లో ఆ నియోజకవర్గం నుంచి ఎంవీవీ సత్యనారాయణ (వైసీపీ) గెలుపొందారు.2024లో ఈ నియోజక వర్గం నుంచి టీడీపీ పోటీ చేసినా.అక్కడ మళ్ళి వైసీపీయే గెలుస్తుదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అటువంటి పరిస్థితుల నేపథ్యంలో వైజాగ్ సీటును జనసేనకు వదిలేసి, నరసాపురం నియోజకవర్గంలో టీడీపీ పోటి చేయాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు సమాచారం.పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు వైజాగ్ నియోజకవర్గం నుండి పోటీ చేసే అవకాశం ఉందని, ఇక్కడ నుండి మెగా అభిమానుల మద్దతు ఎక్కువగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.ఇటీవల చిరంజీవి వైజాగ్‌లో తన ఇంటిని నిర్మిస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ ప్రకటనతో అభిమానుల మనోధైర్యాన్ని పెంచారు.తాజాగా పవన్ కూడా వైజాగ్ పర్యటించిన విషయం తెలిసిందే.ఈ టూర్‌ ఎంత వివాదం అయిందో చెప్పనక్కరలేదు.

అయితే ఇక్కడ అసలు చిక్కు ఏంటంటే.బాలకృష్ట చిన్నల్లుడు భరత్ పరిస్థితి ఏంటని.అయితే ఈ విషయంలో చంద్రబాబు భరత్‌కు ఓ భరోసా ఇచ్చారట.జిల్లాలోని ఏదో ఒక్క అసెంబ్లీ సీటు ఇస్తానని మాటిచ్చినట్లు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube