జనసేన లో నాగబాబుకు కీలక బాధ్యతలు

కొణిదెల నాగబాబు ని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.నాగబాబు ప్రస్తుతం పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యునిగా పార్టీకి సేవలు అందిస్తున్నారు.

 Nagababu Has Key Responsibilities In Janasena Nagendra Babu , Pawan Kalyan, Jana-TeluguStop.com

ఆయన సేవలు మరింత విస్తృతంగా పార్టీకి ఉపయోగపడే విధంగా కీలక బాధ్యతలు అప్పగించనున్నారు.దీంతోపాటు విదేశాలలో ఉన్న పార్టీ ప్రతినిధులు, అభిమానులను నాగబాబు సమన్వయపరుస్తారు.

ఎన్.ఆర్.ఐ.ల సేవలను పార్టీకి సమర్ధవంతంగా ఉపయోగపడే విధంగా నాగబాబు సేవలు అందిస్తారు.

అదే విధంగా నెల్లూరుకు చెందిన ఉన్నత విద్యావంతుడు, గత కొన్నేళ్లుగా జనసేన పార్టీకి పరోక్షంగా సేవలందిస్తున్న వేములపాటి అజయ కుమార్ కి పార్టీకి సంబంధించి కొన్ని ముఖ్య వ్యవహారాల బాధ్యతలను పవన్ కళ్యాణ్ గారు అప్పగించారు.జాతీయ మీడియాకు పార్టీ తరపున అధికార ప్రతినిధిగా సేవలు అందించడంతో పాటు రాజకీయ శిక్షణ తరగతులు, బూత్ స్థాయి పర్యవేక్షణ, పార్టీ అంతర్గత క్రమశిక్షణ (కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్) నిర్వహణ బాధ్యతలను అజయ కుమార్ నిర్వహించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube