రామోజీకి మద్దతు ఇచ్చి నాగబాబు అనవసరంగా బుక్ అయ్యారా?

రామోజీ రావు( Ramoji Rao ) కు మద్దతుగా జనసేన నేత నాగబాబు రిలీజ్ చేసిన లెటర్ జనసేన లో ప్రకంపనలకు కారణం అయ్యింది .

ప్రతీ విషయం లోనూ నాగబాబుకు మద్దతు ఇచ్చే జనసైనికులు ఈ విషయంలో మాత్రం ఆయనను వ్యతిరేకిస్తున్నారు అంతేకాకుండా ఆయన కు తమ కోపం తెలిసేలా సోషల్ మీడియా లో పోస్టలు కూడా పెడుతున్నారు .

నాగబాబు( Nagababu ) రాసిన ఉత్తరంలో తెలుగు మీడియా సినీరంగంలో విశేషమైన మార్పులు తీసుకొచ్చి వేలాది మందికి జీవనాధారం కల్పించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం కల్పించిన రామోజీ రావు తెలుగు ఖ్యాతి ని ఖండాతరాలకు వ్యాపింప చేసిన ఘనత రామోజీరావుదని ,,అలాంటి ఘనత సాధించిన పద్మవిభూషణ్ రామోజీరావు ను 70 ఏళ్లు దాటిన వయసులో విచారణ పేరుతో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వేధించడం మానుకోవాలనిఆయన చెప్పుకొచ్చారు .

నాగబాబు చేసిన ఈ వ్యాఖ్యలపై జనశెన శ్రేణులలోనూ మెదవుల లోనూ మిశ్రమ స్పందన కనిపిస్తుంది.ప్రజారాజ్యం సమయంలో చంద్రబాబు సూచనలతో చిరంజీవి( Chiranjeevi ) కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చి ఆయన వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా రకరకాల వార్తలు వండి వడ్డించిన వ్యక్తి రామోజీరావు అని ప్రజారాజ్యం పతనంలో చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి తో పాటు రామోజీరావు కూడా కీలక పాత్ర పోషించారని అలాంటి వ్యక్తిని ఇలాంటి పరిస్థితుల్లో సమర్థించాల్సిన అవసరం మనకు ఏమిటంటూ నాగబాబుపై జనసైనికులు వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారు.మన పార్టీ నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాలని అంతే తప్ప పక్క పార్టీకి సంబంధించిన వ్యక్తులు పట్ల ఇంత ప్రేమ చూపించాల్సిన అవసరం లేదని ఇది ఇది బానిసత్వం లా కనిపిస్తుంది అంటూ పార్టీ హార్డ్ కోర్ అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా తమ కోపాన్ని చూపిస్తున్నారు.

సామాన్య జనంలో కూడా ఈ విషయం లో మిశ్రమ స్పందన కనిపిస్తుంది .సాధించిన ఘనతకి చేసిన నేరాలకి సంబంధం ఉండదని ఘనతలకు కీర్తిస్తూనే నేరాలకు శిక్షలు విధిస్తారని ఆ రెండిటికీ తేడా కూడా తెలియకుండా నాగబాబు మాట్లాడారంటూ మేధావులు కూడా విమర్శిస్తున్నారు.ప్రపంచంలో గొప్ప ఘనత సాదించిన చాలా మంది క్రీడాకారులు చిన్న చిన్న కేసుల్లో జైలుకు వెళ్లడం మనం చూస్తూనే ఉన్నామని కాబట్టి ఆయన గొప్పతనానికి ఆయన చేసిన నేరాలుకి విచారణ చేయకూడదు అనటం రాజ్యాంగానికి ఎవరు అతీతం కాదు కదా అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..

తాజా వార్తలు