ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే.అయితే ఈ ఫలితాలు ఎవరి ఊహకు అందని విధంగా ఉన్నాయని చెప్పాలి.
గత ఎన్నికలలో 151 సీట్లతో గెలుపొందినటువంటి వైఎస్ఆర్సీపీ( YSRCP ) పార్టీని భూస్థాపితం చేస్తూ 164 సీట్లతో కూటమి అధికారంలోకి వచ్చింది.ఇక ఈ కూటమిలో భాగంగా జనసేన( Janasena )అధినేత సినీ నటుడు పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) పిఠాపురం( Pithapuram ) నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలుపొందిన సంగతి తెలిసిందే.
పిఠాపురంలో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఈసారి ఏకంగా 70000 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

ఈ విధంగా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలవడంతో ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.ఇక పవన్ కళ్యాణ్ అద్భుతమైన విజయం సొంతం చేసుకోవడంతో ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులందరూ కూడా సోషల్ మీడియా వేదికగా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే నాగబాబు( Nagababu ) సైతం తన తమ్ముడి గెలుపు పై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా నాగబాబు ఎక్స్ వేదికగా స్పందిస్తూ.సరికొత్త రాజకీయ మలుపుగా ఈ గెలుపు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది.ఈ గెలుపు జనం గెలుపు.జనసేనాని గెలుపు. విజనరీ చంద్రబాబు గెలుపు.భరతమాత ముద్దు బిడ్డ గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గెలుపు.నాయకుడి పిలుపుతో మార్పు కోసం పాటుపడిన ప్రతి పౌరుడి గెలుపు.
కూటమి విజయానికి పాటుపడిన ప్రతి కార్యకర్తకి, ప్రతి జనసైనికుడికి, వీరమహిళకి నా ధన్యవాదాలు, శుభాబినందనలు అంటూ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇక పవన్ కళ్యాణ్ గెలుపు కోసం నాగబాబు ఆయన కుటుంబ సభ్యులు ఎంతగానో కష్టపడ్డారు అనే సంగతి మనకు తెలిసిందే.