యంగ్ హీరో నాగ శౌర్య ఈ మధ్య వరుస సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు.ఇప్పటికే ఒక పవర్ ఫుల్ మాస్ సబ్జెక్టుతో సంతోష్ దర్శకత్వంలో పార్ధు సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.గత నెలలో వరుసగా తన సొంత ప్రొడక్షన్ లో అనీష్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యి ఓపెనింగ్ చేసేశాడు.
అలాగే మరో కొత్త దర్శకుడుతో కూడా సినిమా స్టార్ట్ చేశాడు.ఈ రెండు సినిమాలు వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే సోలో హీరోగా తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న నాగ శౌర్య తన బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే రొమాంటిక్ కథలని ఓ వైపు చేస్తూనే మరో వైపు లుక్ మార్చి మాస్ కమర్షియల్ చిత్రాలు కూడా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు.ప్రస్తుతం నాగశౌర్య సౌజన్య అనే కొత్త అమ్మాయి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో నాగశౌర్యకి జోడీగా రీతూవర్మ నటిస్తుంది.సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి తాజాగా టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది.
వరుడు కావలెను అనే టైటిల్ ఫైనల్ చేసినట్టు సమాచారం.ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమా చివరిదశలో ఉంది.
ఈ నెలాఖరు లేదంటే డిసెంబర్ నాటికి సినిమా షూటింగ్ పూర్తి చేసి కొత్త సినిమాకి వెళ్లాలని నాగశౌర్య ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది.మరి చలో సినిమా తర్వాత సాలిడ్ హిట్ కోసం ప్రయత్నం చేస్తున్న శౌర్యకి ఈ సినిమా ఎంత వరకు ఆ కోరిక తీరుస్తుందో అనేది చూడాలి.







