యంగ్ హీరో నాగ శౌర్య తన హోమ్ బ్యానర్ లో నటించిన కృష్ణ వ్రిందా విహారి సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.ఈ సినిమాతో పాటు మరో మూడు నాలుగు సినిమాలు కూడా నిన్న తెలుగు బాక్సాఫీస్ వద్దకు వచ్చాయి.
తెలుగు సినిమా విశ్లేషకులు నిన్న విడుదలైన సినిమాలన్నింటికీ కూడా దాదాపుగా నెగిటివ్ రేటింగ్ మాత్రమే ఇచ్చారు.ప్రతి సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయింది అంటూ రివ్యూలు వచ్చాయి.
అయితే కొందరు మాత్రం కొన్ని సినిమాలకు పాజిటివ్ రివ్యూ లు ఇచ్చారు.ప్రేక్షకుల యొక్క తీర్పు ఎలా ఉంటుంది అనేది ఆదివారం వరకు తేలిపోయే అవకాశం ఉంది.
సోమవారం ఏ సినిమా నిలుస్తుంది ఏ సినిమా పోతుంది అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.నాగ శౌర్య నటించిన సినిమా యొక్క ఫలితం సూపర్ హిట్ అన్నట్లుగా వారు ప్రచారం చేసుకుంటున్నారు.
ఇప్పటికే సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహించారు.పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చుతూ ఆనందం వ్యక్తం చేశారు, స్వీట్లు పంచుకున్నారు.ఈ స్థాయి సక్సెస్ నిజంగానే దక్కిందా అంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ సినిమా సక్సెస్ వేడుక కు సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి.
ఇలా సక్సెస్ అయ్యింది అంటూ సక్సెస్ సెలబ్రేషన్ చేసుకోవడం కూడా ఒక పబ్లిసిటీ స్టంట్ అంటూ కొందరు అభిప్రాయం చేస్తున్నారు.
సినిమా కు సక్సెస్ దక్కకుండా కొందరు సక్సెస్ అయింది అంటూ ప్రచారం చేసుకుంటూ ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు.
నిజంగానే నాగశౌర్య నటించిన సినిమా సక్సెస్ అయిందా లేదంటే పబ్లిసిటీ కోసం ఇలా చేశారా అనేది తెలపాల్సి ఉంది.నాగశౌర్య సినిమా ఈ మధ్య కాలంలో బ్యాక్ టు బ్యాక్ బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూ వస్తున్నాయి.
కనీసం ఈ సినిమా అయినా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అనేది చూడాలి.మొదటి వారం పూర్తి అయ్యే వరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించకుంటే కష్టమే అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.