'థాంక్యూ' చెప్పడానికి కూడా యాటిట్యూడ్ చూపిస్తున్న చైతూ!

అక్కినేని యంగ్ హీరోల్లో నాగ చైతన్య ఒకరు.ఈయన ఎప్పుడు క్లాసీ లుక్ తో అభిమానులను ఆకట్టుకుంటాడు.

 Naga Chaitanya Thank You Movie New Poster , Naga Chaitanya ,  rashi Khanna , Th-TeluguStop.com

కానీ తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ హెవీ ఇంటెన్స్ లుక్ లో చైతూ కనిపించి తన అభిమానులకు షాక్ ఇస్తున్నాడు.ప్రస్తుతం నాగ చైతన్య విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుని మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో వరుసగా హిట్స్ కొట్టుకుంటూ వస్తున్న చైతూ ఇప్పుడు అందరికి థాంక్యూ చెప్పడానికి వస్తున్నాడు.

మనం వంటి ఎవర్ గ్రీన్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.ఈ సినిమా నుండి వచ్చిన టీజర్, సాంగ్స్ ఇప్పటికే మంచి రెస్పాన్స్ అందుకోగా.

ఇప్పుడు మరొక పోస్టర్ ను మేకర్స్ రివీల్ చేసారు.

చైతు కొత్త లుక్ ను చూసి ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు.

ఇప్పటికే రివీల్ అయినా పోస్టర్స్ అన్నిటికి చూస్తుంటేనే అర్ధం అవుతుంది ఈ సినిమాలో చైతూ మొత్తం మూడు విభిన్నమైన షేడ్స్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది.ఇక ఇప్పుడు వదిలిన మాస్ లుక్ కూడా ఆకట్టుకుంటుంది.

ఈ పోస్టర్ లో చైతన్య డెనిమ్ షర్ట్, జీన్స్ వేసుకుని.రఫ్ గడ్డంతో చేతిలో హాకీ స్టిక్ పట్టుకుని యాటిట్యూడ్ చూపిస్తున్నాడు.

Telugu Avika Gore, Vikram Kumar, Malvika Nair, Naga Chaitanya, Rashi Khanna, Pos

వరుస హిట్స్ తో అలరిస్తున్న నాగ చైతన్య మరి థాంక్యూ సినిమాతో కూడా ఆకట్టు కుని హిట్ కొడతాడో లేదో చూడాలి.ఈ సినిమాను విక్రమ్ రొమాంటిక్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తుండగా.నాగ చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే మాళవిక నాయర్, అవికా గోర్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube