యువ హీరో అక్కినేని నాగ చైతన్య ( Naga Chaitanya ) హీరోగా నాచురల్ బ్యూటీ సాయి పల్లవి ( Sai Pallavi ) హీరోయిన్ గా చందు మొండేటి ( Chandoo Mondeti ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘తండేల్’‘( Thandel ).ఈ సినిమా ఇటీవలే గ్రాండ్ గా లాంచింగ్ జరుపుకుంది.

లాంచింగ్ అయిన వెంటనే షూట్ కూడా స్టార్ట్ చేసారు.వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో చైతూ జాలరి పాత్రలో నటిస్తుండగా.ప్రస్తుతం ఈ సినిమా షూట్ కర్ణాటక లోని గోకమా ప్రాంతంలో జరుగుతుంది.మరి ఈ సినిమా కొత్త షెడ్యూల్ లో సాయి పల్లవి కూడా అడుగు పెట్టినట్టు తెలుస్తుంది.

మరి సాయి పల్లవి షూటింగ్ లో బిజీ బిజీగా గడుపుతూనే విరామ సమయంలో సాయంత్రం సూర్యోదయ వేళ అక్కడి బీచ్ అందాలను ఎంజాయ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.తాజాగా ఈమె బీచ్ దగ్గర సమయం గడుపుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈమె పిక్ చూసి నెటిజెన్స్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారుకాగా నాగ చైతన్య వరుస ప్లాప్స్ తర్వాత ఇప్పుడు తన కెరీర్ లో ప్రేమమ్, సవ్యసాచి వంటి సినిమాల హిట్స్ ఇచ్చిన చందు మొండేటి ( Chandoo Mondeti ) దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా గీతా ఆర్ట్స్ 2 వారు నిర్మిస్తున్నారు.
చూడాలి ఈ కాంబో ఎలా ఆకట్టుకుంటుందో.







