టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య(Akkineni Naga Chaitanya ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కస్టడీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇటీవలె ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది.ఈ సినిమా మే 12న విడుదల కానున్న విషయం తెలిసిందే.
ఇక ప్రస్తుతం నాగ చైతన్య వరుసగా సినిమాల్లో నటిస్తూ తన పని తాను చేసుకుంటూ వెళుతున్నాడు.ఇది ఇలా ఉంటే తాజాగా నాగ చైతన్యకు సంబంధించిన ఒక ఆసక్తికర వార్త చెక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే చైతన్య తన అభిరుచుకి తగ్గట్లుగా కొత్త ఇల్లు నిర్మించుకుని అందులోకి ఇటీవలె గృహప్రవేశం చేసినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.

ఇటువంటి హడావిడి సందడి లేకుండా నాగచైతన్య కొత్త ఇంట్లోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది.కాగా చైతన్య, సమంత( Samantha ) పెళ్లి తరువాత ఒక కొత్త ఫ్లాట్ ని కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.అది సీనియర్ నటుడు మురళి మోహన్( Murali Mohan ) కి చెందిన ప్రాపర్టీనే.
ఈ విషయాన్ని మురళి మోహన్ గతంలో స్వయంగా వెల్లడించిన సంగతి తెలిసిందే.ఆ ఇంటిని వేరే వాళ్లకు అమ్ముదామని అనుకుంటున్న సమయంలో నాగ చైతన్య, సమంత వచ్చి అడిగారని దాంతో కాదనలేక వారికే ఆ ఇల్లు ఇచ్చినట్లు మురళి మోహన్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
కాగా పెళ్లి తరువాత కొంతకాలం సమంత, నాగ చైతన్య ఇద్దరు ఆ ఇంట్లోనే కాపురం చేసిన విషయం తెలిసిందే.ఆ తర్వాత విభేదాలతో చైతు విడిపోయిన సంగతి తెలిసిందే.

దీనితో ఆ ఫ్లాట్ ని చైతు సమంతకి విడిచిపెట్టి నాగార్జున( Nagarjuna ) ఇంట్లోకి వెళ్ళాడట.అయితే చైతు ఎప్పటి నుంచో తన అభిరుచికి తగ్గట్లుగా మోడ్రన్ గా ఉండే మంచి ఇంటిని నిర్మించుకోవాలని అనుకునేవాడట.నాగార్జున ఇంటికి దగ్గర్లోనే ఒక స్థలం కొని చకచకా ఒక లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నాడట చైతు.స్విమ్మింగ్ పూల్, అందమైన గార్డెన్, జిమ్, థియేటర్ ఉండే విలాసవంతమైన ఇంటిని రెడీ చేసుకున్నాడు.
ఇటీవల చైతు ఆ ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది.తన సామాను మొత్తం మార్చేసుకున్నాడట.
ఇక నుంచి చైతు అక్కడే ఉండబోతున్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అయితే చాలా రోజులుగా చై రెండవ పెళ్లి, ప్రేమ గురించి వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.







