సెన్సార్ పూర్తి చేసుకున్న లవ్ స్టోరీ.. రన్ టైమ్ ఎంతంటే?

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం నటిస్తున్న సినిమా లవ్ స్టోరీ.

ప్రేమ కథలను తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో నాచురల్ బ్యూటీ సాయి పల్లవి నాగ చైతన్య కు జంటగా నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

ఈ సినిమా నుండి విడుదల అయినా అన్ని పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా బాగా ఆకట్టుకున్నాయి.ఇక ఈ సినిమా నుండి విడుదల అయినా పాటల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు.

ఒక్కో పాట యూట్యూబ్ లో రికార్డ్ సృష్టించింది.ఎవ్వరి నోట విన్నా లవ్ స్టోరీ పాటలే వినిపించాయి.

Advertisement

ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్న ఇంకా విడుదలకు నోచుకోలేదు.కరోనా కారణంగా ఇప్పటి వరకు వాయిదా పడుతూ వస్తుంది.

ఈ సినిమాను సెప్టెంబర్ 10న వినాయక చవితి సందర్భంగా విడుదల చేస్తామని ప్రకటించి మళ్ళీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

అయితే మళ్ళీ ఈ మధ్య సెప్టెంబర్ 24 న విడుదల చేస్తామని కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు.ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.రెండు రోజుల క్రితమే ఈ సినిమా నుండి వచ్చిన ట్రైలర్ కూడా అభిమానులను బాగా ఆకట్టుకుంది.

మరొక పర్ఫెక్ట్ లవ్ స్టోరీ ని తెరమీద చూపించేందుకు శేఖర్ కమ్ముల అంతా సిద్ధం చేసుకున్నాడు.

కీళ్ల నొప్పుల నుంచి మ‌ల‌బ‌ద్ధ‌కం నివార‌ణ వ‌ర‌కు ఆముదంతో ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా?
అల్లు అర్జున్ విషయం లో లాయర్ నిరంజన్ రెడ్డి ఏం చేస్తున్నారు...

ఇక ఈ సినిమాలో నాగ చైతన్య మిడిల్ క్లాస్ యువకుడిగా నటించాడని ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది.ఇక చతన్య, సాయి పల్లవి నటన అద్భుతంగా ఉందనే చెప్పాలి.ఒక్క ట్రైలర్ లోనే భాధ, కోపం, సంతోషం, ప్రేమ, ఉద్యోగం, కుటుంబం ఇలా అన్ని చూపించి మరొక సారి తన మార్క్ చూపించాడు శేఖర్ కమ్ముల.

Advertisement

ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల అవ్వబోతున్న నేపథ్యంలో సెన్సార్ పూర్తి చేసుకుంది.ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు.

ఇక సెన్సార్ సభ్యులు శేఖర్ కమ్ములను ప్రశంసించినట్టు తెలుస్తుంది.ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 25 నిముషాలుగా ఉంది.

ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు