Naga Chaitanya : మరోసారి నోరు జారిన నాగచైతన్య.. ఓ రేంజ్ లో ఆడుకుంటున్న సమంత ఫ్యాన్స్?

అప్పుడప్పుడు పొరపాటున నోరు జారడం అనేది మామూలు విషయమే.కానీ అది మాత్రం పెద్ద చర్చకు దారి తీస్తుంది.

 Naga Chaitanya Has Slipped His Mouth Once Again Are Samantha Fans Playing In A-TeluguStop.com

అది ఏ విషయంలోనైనా సరే పొరపాటున అనకూడనిది అంటే మాత్రం అంతే సంగతి.అయితే తాజాగా నాగచైతన్య( Naga Chaitanya ) కూడా నోరు జారగా సమంత ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు.

అయితే అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మామూలుగా సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలలో ఎవరైనా జంట విడిపోతే ఆ విషయాన్ని కొన్ని రోజులు మాత్రమే పట్టుకుంటారు జనాలు.

కానీ ఇక్కడ విడిపోయి ఒక ఏడాది దాటినా కూడా నాగచైతన్య, సమంతలను మాత్రం అస్సలు వదలట్లేదు తెలుగు ప్రేక్షకులు.నాలుగు సంవత్సరాల కిందట వీరిద్దరూ తమ కుటుంబ సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

అలా పెళ్లయిన తర్వాత మూడేళ్లు ఎంతో అన్యోన్యంగా కనిపించారు.ప్రతి ఒక్కరి దృష్టి తమపై పడేలా చేసుకున్నారు.

అలా చూడ ముచ్చటగా కనిపించిన ఈ జంట పెళ్లయిన నాలుగేళ్లకే విడాకుల పేరుతో పెద్ద షాక్ ఇచ్చారు.దీంతో అప్పట్లో ఈ విషయం బాగా చర్చనీయాంశంగా మారింది.

ఇక ఇద్దరు ఎవరి దారి వారి అన్నట్లు బిజీగా ఉండగా జనాలు మాత్రం వీరి విడాకుల గురించి ఇప్పటికీ చర్చ తీస్తూనే ఉన్నారు.

Telugu Krithi Shetty, Pooja Hegde, Samantha, Tollywood-Movie

ఇక వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూలో పాల్గొంటే వారికి కూడా ఏదో ఒక విధంగా విడాకుల గురించి ప్రశ్న ఎదురవుతూనే ఉంది.అయితే వీరిద్దరూ ఇప్పటివరకు ఏ విషయంలో విడిపోయారు అనేది క్లారిటీ అయితే రాకపోగా మధ్య మధ్యలో ఎన్నో వార్తలు అయితే వచ్చాయి.అయితే ఇదంతా పక్కన పెడితే మరోసారి వీరి పేర్లు బాగా హాట్ టాపిక్ గా మారాయి.

Telugu Krithi Shetty, Pooja Hegde, Samantha, Tollywood-Movie

ప్రస్తుతం నాగచైతన్య కస్టడీ అనే సినిమాలో నటించగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.అయితే ప్రస్తుతం నాగచైతన్య ప్రమోషన్స్ భాగంలో బిజీగా ఉండగా.ఈ భాగంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని విషయాలు పంచుకున్నాడు.అయితే యాంకర్.మీకు హీరోయిన్స్ ఎవరిలో ఏది నచ్చుతుంది అని అడగటంతో వెంటనే నాగ చైతన్య.

Telugu Krithi Shetty, Pooja Hegde, Samantha, Tollywood-Movie

పూజ హెగ్డే( Pooja Hegde ) లో స్మైల్ ఇష్టమని, సమంత లో హార్డ్ వర్క్ అంటే ఇష్టమని, కృతి శెట్టిలో ఇన్నోసెంట్, డీసెంట్ అంటే ఇష్టమని అన్నాడు.అయితే విడాకుల తర్వాత కూడా సమంతను నాగచైతన్య ఓ రేంజ్ లో పొగడటంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.దీంతో జనాలు నాగచైతన్యను.

సినిమాల ప్రమోషన్ టైంలో సమంతను పోగొట్టేస్తావా( Samantha ) చైతు అంటూ అడుగుతున్నారు.

దీంతో నాగచైతన్య నోరు జారడంతో జనాలు ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారని చెప్పాలి.

ఏదేమైనా సరే ప్రస్తుతం ఈ విషయం మాత్రం మరోసారి హాట్ టాపిక్ గా మారింది.మళ్లీ నాగచైతన్య నోటి నుండి సమంత పేరు రావడం.

కానీ సమంత మాత్రం సోషల్ మీడియా( Social Media )లో నాగచైతన్యకు తగిలేటట్టు పోస్టులు పెట్టడం చూస్తుంటే నాగచైతన్య కు ఇష్టం ఉన్నా కూడా సమంతకి ఇష్టం లేదు అన్నట్లుగా తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube