అక్కినేని ఫ్యామిలీ హీరోలు గత కొన్నాళ్లుగా వరుస డిజాస్టర్ చవి చూస్తున్నారు.ఆ మధ్య నాగార్జున ( Nagarjuna )ది ఘోస్ట్ చిత్రం తో నిరాశ పర్చిన విషయం తెలిసిందే.
అఖిల్ ఇటీవల ఏజెంట్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అట్టర్ ఫ్లాప్ ఫలితాన్ని చవి చూశాడు.ఇప్పుడు నాగ చైతన్య( Naga Chaitanya ) కస్టడీ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది రెడీ అయ్యాడు.
రేపు విడుదల కాబోతున్న కస్టడీ సినిమా కు తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు ( Venkat Prabhu )దర్శకత్వం వహించాడు.
కృతి శెట్టి( Krithi Shetty ) హీరోయిన్ గా నటించిన థాంక్యూ సినిమా అట్టర్ ఫ్లాప్ అయ్యింది.ఆ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని దర్శకుడు విక్రమ్ కే కుమార్( Vikram Kumar ) చేయడం జరిగింది.అయినా కూడా నాగ చైతన్యకి సక్సెస్ ని ఇవ్వడంలో విఫలమయ్యాడు.
ఆ సినిమా ఫెయిల్యూర్ నుండి వెంటనే బయటికి వచ్చిన నాగ చైతన్య కస్టడీ సినిమా ను చేయడం జరిగింది.ఈ సినిమా తో మొదటి సారి తమిళం ప్రేక్షకుల ముందుకు నాగచైతన్య వెళ్లబోతున్నాడు.
ఈ సినిమా కి తమిళనాడు( Tamilanadu ) లో కూడా మంచి బజ్ క్రియేట్ అయింది.
దర్శకుడు వెంకట్ ప్రభు కి తమిళనాడు లో మంచి గుర్తింపు ఉంది.అందుకే అక్కడ కూడా భారీగా రిలీజ్ గా అవుతుంది.రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
నాగ చైతన్య గతం లో నటించిన బంగార్రాజు( Bangarraju ) సినిమా లో కృతి శెట్టితో కలిసి రొమాన్స్ చేసిన విషయం తెలిసిందే.ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
మళ్ళీ అదే కాంబినేషన్ రిపీట్ అవుతున్న కారణంగా కచ్చితంగా కస్టడీ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు ఉన్నాయి అంటూ అక్కినేని( Akkineni) అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు.ఈ మధ్య కాలం లో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతున్నాయి.
కనుక కష్టపడి సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంటే చాలు కలెక్షన్స్ భారీగా నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.ఈ సమ్మర్ హాలిడేస్ ని కనీసం నాగ చైతన్య కస్టడీ సినిమా అయినా వినియోగించుకుంటుందా అనేది చూడాలి.