ఆ దర్శకుడి వల్ల నాగచైతన్య విలువైన 4 నెలలు వృధా

యంగ్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిట్ అవుతూ బిజీ బిజీగా ఉండాలనుకుంటారు.కానీ కొందరు దర్శకుల వల్ల వారు చేసుకున్న ప్లాన్ లు తల కిందులు అవుతూ ఉంటాయి.

 Naga Chaitanya 4 Months Of Time Waste Due To Director Parashuram  , Kriti Shetty-TeluguStop.com

ఒక సినిమా పూర్తయిన వెంటనే మరో సినిమా చేయాలనుకుంటే దర్శకులు హ్యాండ్ ఇవ్వడం.లేదంటే మరి ఏదైనా జరగడం కామన్ విషయం.

ఇప్పుడు అక్కినేని హీరో నాగ చైతన్యకు( Naga Chaitanya ) అదే పరిస్థితి ఎదురయింది.

Telugu Coustady, Krithy Shetty, Naga Chaitanya, Parashuram, Telugu-Movie

తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు( Director Venkat Prabhu ) దర్శకత్వం లో చేసిన కస్టడీ( Custody ) అనే సినిమా తో నాగచైతన్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.కష్టడీ సినిమా ఫలితం గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు.నాగ చైతన్య ఆ సినిమా ను ఎందుకు ఒప్పకున్నాడో ఆయనకే తెలియాలి.

హీరోయిన్ గా నటించిన కృతి శెట్టి( Kriti Shetty ) కి ఆ సినిమా మరో ఫ్లాప్ గా నిలిచింది.ఇక కస్టడీ సినిమా తర్వాత వెంటనే నాగ చైతన్య మరో సినిమా ను మొదలు పెట్టాల్సి ఉంది.

Telugu Coustady, Krithy Shetty, Naga Chaitanya, Parashuram, Telugu-Movie

ఆ సినిమాకి పరశురాం( Parasuram ) దర్శకత్వం వహించాల్సి ఉంది.కానీ పరశురాం తో ఇప్పుడు ఆ సినిమా చేయడం లేదు.దర్శకుడు పరుశురాం నాగచైతన్య తో సినిమా ను కాదని మరో హీరో తో సినిమా చేసేందుకు సిద్ధం అయిన విషయం తెలిసిందే.పరశురామ్ తో సినిమా కమిట్ అవ్వడం వల్ల ఇతర దర్శకులతో నాగ చైతన్య సినిమా కమిట్ అవ్వకుండా ఉండి పోయాడు.

ఇప్పుడు పరశురాం సినిమా క్యాన్సల్ అవ్వడంతో నాగ చైతన్య సమయం వృధా అవుతుంది.దాదాపు నాలుగు నెలల పాటు నాగ చైతన్య ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

నాగ చైతన్య మరో సినిమా కు కమిట్ అవ్వడానికి కచ్చితంగా సమయం పడుతుంది.ఆ తర్వాత సినిమా పెట్టాలెక్కడానికి ఇంకాస్త సమయం పడుతుంది.అసలే సక్సెస్ లు లేక ఢీలా పడి పోయినా నాగ చైతన్య ఇలా నెలలకు నెలలు వృధా చేస్తే కెరియర్ పై మరింతగా ప్రభావం పడుతుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.దర్శకుడు పరశురాం వల్ల నాగ చైతన్య కెరియర్ లో అత్యంత కీలకమైన సమయం వృధా అవుతోంది అని అక్కినేని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube