వైసీపీ ప్రభుత్వంపై జనసేన నాయకుడు నాదెండ్ల మనోహార్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.పోలవరం ప్రాజెక్టు ఎత్తును 41.15 మీటర్లకు పరిమితం చేసేందుకు వైసీపీ సర్కార్ అంగీకారం తెలిపిందని ఆయన ఆరోపించారు.పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని విమర్శించారు.
ప్రాజెక్టు నిధులను ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలో త్వరలోనే తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పోలవరంలో పర్యటిస్తారని వెల్లడించారు.







