Nagababu : టికెట్ దక్కని జనసేన నేతలను బుజ్జగిస్తున్న ‘నాదెండ్ల ‘ నాగబాబు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై దృష్టి సారించారు.ముఖ్యంగా టికెట్లు దక్కక అసంతృప్తికి గురైన జనసేన కీలక నాయకులను బుజ్జగించేందుకు రంగంలోకి దిగారు.

 Nadendla Nagababu Is Pacifying The Janasena Leaders Who Did Not Get Tickets-TeluguStop.com

టిడిపి, జనసేన, బిజెపి( TDP, Janasena, BJP ) కూటమిగా ఏర్పడడంతో, పొత్తులో భాగంగా జనసేన కొన్ని కీలక స్థానాలను వదులుకోవాల్సి వచ్చింది.దీంతో అందరికీ సీట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో పవన్ ఉన్నారు.

ఇదే విషయాన్ని పవన్ అసంతృప్త నాయకులకు చెప్పి, వారిని బొజ్జగించే పనికి శ్రీకారం చుట్టారు.అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల ప్రచారం, కూ టమి అభ్యర్థుల గెలుపు పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.

దీనిలో భాగంగానే పార్టీలోని అసంతృప్త నాయకులను బుజ్జగించి వారిని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు .ఈ మేరకు జనసేన కీలక నేతలకు ఆ బాధ్యతలను అప్పగించారు.ముఖ్యంగా జనసేనలో టికెట్ వివాదాలు, అభ్యర్థుల మధ్య విభేదాలను పరిష్కరించే బాధ్యతను జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్( Chairman Nadendla Manohar ) కు పవన్ అప్పగించారు.అలాగే అభ్యర్థుల మధ్య విభేదాలను పరిష్కరించే బాధ్యతలను పవన్ సోదరుడు నాగబాబుకు అప్పగించారు.

దీంతో ఈ ఇద్దరు నేతలు రంగంలోకి అసంతృప్తి నేతలను బుజ్జగించే పనికి శ్రీకారం చుట్టారు.

Telugu Ap, Janasena, Janasenani, Pothina Mahesh, Telugudesam-Politics

పొత్తులో భాగంగా టిడిపికి సీటు కేటాయించిన చోట్ల జనసేన టికెట్ పై ఆశలు పెట్టుకుని అసంతృప్తికి గురైన వారిని పిలిపించి నాదెండ్ల మనోహర్ వారితో మాట్లాడుతున్నారు.రెండు మూడు రోజులుగా పార్టీ కార్యాలయంలోనే నాగబాబు ఉంటూ అసంతృప్తి నేతలను బుజ్జగిస్తున్నారు.టికెట్ దక్కని చాలామంది నేతలు పార్టీ మారుతూ ఉండడంతో, వలసలకు బ్రేక్ వేసే విధంగా రంగంలోకి దిగారు.

టిడిపి, జనసేన, బిజెపి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ నామినేటెడ్ పదవులు ఇచ్చి న్యాయం చేస్తామని, ప్రస్తుతం పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

Telugu Ap, Janasena, Janasenani, Pothina Mahesh, Telugudesam-Politics

ముఖ్యంగా విజయవాడ( Vijayawada ) వెస్ట్ లో జనసేన లో రోజురోజుకి వివాదం ముదురుతూ ఉండడంతో, ఇప్పటికే అక్కడ కీలక నేతగా ఉన్న పోతిన మహేష్ తో మనోహర్ మాట్లాడారు.అలాగే రామచంద్రపురం నేతలతోనూ ఆయన భేటీ అయ్యారు.సీటు తమకే కేటాయించాలంటూ రామచంద్రపురం జనసేన నేతలు మంగళగిరి జనసేన ఆఫీస్ ముందు ఆందోళనకు పిలుపునివ్వడంతో వారిని తెనాలి పిలిపించి మనోహర్ మాట్లాడారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube