ఆర్ఆర్ఆర్ క్రేజ్ తగ్గేదేలే.. లండన్ లో వందల మంది ఒకేసారి స్టెప్పులేయడంతో?

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ( S.S.Rajamouli )దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్.( RRR movie ) గత ఏడాది విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ లో విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే.

 Naatu Naatu Song Performance At London Streets Viral Videos, Naatu Naatu Song ,-TeluguStop.com

ఇందులో హీరోలుగా నటించిన రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ లు గ్లోబల్ స్టార్ లుగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.అంతేకాకుండా ఈ సినిమా ఆస్కార్ అవార్డుని సైతం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇందులో చెర్రీ అల్లూరి సీతారామరాజుగా, తారక్ కొమురం భీమ్ గా ఎన్టీఆర్( NTR ) నటించిన సంగతి తెలిసిందే.

Telugu London Streets, Naatu Naatu, Rajamouli, Tollywood-Movie

కోట్లలో కలెక్షన్స్ ను రాబట్టడంతో పాటు రికార్డులను తిరగరాసింది.దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతో గుర్తింపు సాధించింది.హాలీవుడ్ దిగ్గజ దర్శకులు జేమ్స్ కామరూన్ లాంటివారు సైతం ఈ సినిమాను చూసి ప్రశంసించారంటే మన తెలుగు సినిమా స్థాయి హాలీవుడ్ రేంజ్ కు ఎగబాకింది అనడంలో అతిశయోక్తి లేదు.

కాగా ఆర్ఆర్ఆర్ కు ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ వచ్చిన విషయం తెలిసిందే.ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయ్యి ఏడాది దాటేసింది, ఆస్కార్ గెలిచి కూడా చాలారోజులు అవుతోంది.

కాని ఇంకా ఈ సినిమా క్రేజ్, మేనియా ఇంకా తగ్గడం లేదు.తాజాగా ఈ పాటకి లండన్‌ వీధుల్లో దాదాపుగా 700 మంది డాన్స్ వేసి అదరగొట్టేశారు.

Telugu London Streets, Naatu Naatu, Rajamouli, Tollywood-Movie

ఆగష్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా మహిళలంతా చీరల్లో నాటు నాటు పాటకి కాలు కదిపారు.లండన్‌ లోని 10 డౌనింగ్ స్ట్రీట్ లో ఈ ప్రదర్శన జరిగింది.ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఆర్ఆర్ఆర్ ఫ్యాన్స్ ఈవీడియోలను ఇంకా వైరల్ చేస్తున్నారు.ఆ వీడియోలపై కామెంట్ ల వర్షం కురిపించడంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.కాగా నాటు నాటు పాట ఇప్పటికే ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా అందుకుంది.

తాజాగా లండన్ లో ఈ పాటకు స్టెప్పులు వేసిన వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube