టాలీవుడ్ అక్కినేని హీరో నాగార్జున( Nagarjuna ) తాజాగా నటించిన చిత్రం నా సామిరంగ( Naa Saami Ranga ).మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన పొరింజు మరియమ్ జోస్ అనే చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమాను రూపొందించారు.
విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన ఈ సినిమా తాజాగా జనవరి 14న సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన విషయం తెలిసిందే.ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి ఉన్నాయి.
కాగా ఈ సంక్రాంతి బరిలో నాలుగు సినిమాలు ఉండగా అందులో తమదే అచ్చమైన పండగ సినిమా అని ముందు నుంచి చిత్ర యూనిట్ గట్టిగా చెబుతోంది.

ఆ దిశగానే ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేసింది.ఇప్పటికే ఓవర్సీస్‌తో పాటు పలు చోట్ల ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది.సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
అందులో భాగంగానే ట్విట్టర్ ఇంస్టాగ్రాములలో రకరకాల ట్వీట్స్ చేస్తున్నారు.నా సామిరంగ చిత్రానికి ట్విటర్‌లో మిశ్రమ స్పందన లభిస్తోంది.
సినిమా బాగుందని, నాగార్జున హిట్ కొట్టాడని కొంతమంది కామెంట్ చేస్తుంటే సినిమా యావరేజ్ అని మరికొంతమంది కామెంట్‌స్ చేస్తున్నారు.

ఫస్టాఫ్ అదిరిపోయింది.సెకండాఫ్ అంచనాలను మించి పోయింది.చాలా కాలం తర్వాత నాగార్జునకు ఒక భారీ హిట్ పడింది అని రాసుకొచ్చాడు ఒక నెటిజన్.
అల్లరి నరేష్( Allari Naresh ) కూడా బాగానే నటించాడు అని రాసుకొచ్చారు మరో నెటిజన్.

సామిరంగ మూవీ ఫస్టాఫ్ ఇప్పుడే ఫినిష్ అయింది.అన్ని రకాల ఎమోషన్స్‌తో ప్రథమార్థం ముగిసింది.నాగార్జున మాస్ ఫైట్ అదిరిపోయింది.
లవ్‌స్టోరీ బాగుంది.ఇంటర్వెల్ ఒక సీన్ రిపీట్ అవుతుంది.
ఓవరాల్‌గా సినిమా సూపర్ హిట్ అని మరో నెటిజన్ రాసుకొచ్చాడు.ఇంట్రడక్షన్ ఫైట్ బాగుంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక ఫస్ట్ హాఫ్ మూవీ అయితే బాగుంది.బోరింగా అనిపించలేదు అంటూ ట్వీట్ చేశారు.







